‘భరత్’, ‘సూర్య’లను తొక్కిపడేసిన ‘మహానటి’

మన టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ వ్యాల్యూ ఏంటో అందరికీ తెలుసు! స్టార్ హీరోల రేంజులో కుండపోత వర్షం కురిపించవు.. కేవలం డీసెంట్ వసూళ్ళతోనే నెట్టుకొస్తాయి. అదికూడా సోలోగా రిలీజైనప్పుడే సాధ్యమవుతుంది. అదే బరిలో ఇతర చిత్రాలేమైనా పోటీగా వుంటే మాత్రం.. వాటి పరుగు నత్తనడకే! బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఇప్పుడు ‘మహానటి’ రివర్స్‌లో కదం తొక్కుతోంది. తనకు పోటీగా వున్న బడా హీరోల సినిమాల్ని (భరత్ అనే నేను, నా పేరు సూర్య) బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తూ.. వాటికంటే అత్యధిక వసూళ్ళతో దూసుకుపోతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే గత వీకెండ్ రిపోర్ట్!

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. గత వీకెండ్‌లో (11వ తేదీ నుంచి 13 వరకు) ‘మహానటి’ చిత్రం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌ నగరాల్లో ప్రదర్శింపబడుతున్న మల్టీప్టెక్సుల (168 స్ర్కీన్స్) నుంచి 2.8 కోట్లు (నెట్) కొల్లగొట్టింది. ఇక అవే నగరాల్లోని మల్టీప్టెక్సుల (82 స్ర్కీన్స్) నుంచి ‘నా పేరు సూర్య’ రూ.1.09 కోట్లు (నెట్) రాబట్టింది. ఇక ‘భరత్ అనే నేను’ చిత్రం 65 స్ర్కీన్స్ నుంచి కేవలం రూ.63 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అఫ్‌కోర్స్.. ఇక్కడ స్ర్కీన్ కౌంట్ కూడా మేటర్ కావచ్చు. దాని గురించి మాట్లాడుకుంటే.. బన్నీ, మహేష్ స్టార్‌డమ్‌లతో పోల్చుకుంటే వీళ్ళకే ఎక్కువ స్ర్కీన్స్ దక్కాల్సింది. కానీ.. లెజెండరీ నటి సావిత్రి జీవితంపై రూపొందిన ‘మహానటి’ ఆద్యంతం ఆకట్టుకోవడంతో.. జనాలు ఈ చిత్రానికే బ్రహ్మరథం పడుతున్నారు.

అందుకే.. ఆ రెండు చిత్రాల స్ర్కీన్ కౌంట్ తగ్గిపోవడంతో పాటు వసూళ్ళు కూడా తగ్గుముఖం పట్టాయి. ‘మహానటి’ మాత్రం తాండవం చేస్తూ.. అదిరిపోయే కలెక్షన్లు నమోదు చేస్తోంది. ఇదే దూడుకుతో కొనసాగితే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదవ్వడం ఖాయం!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.