2 మిలియన్ డాలర్లతో మహానటి మహా రికార్డు!

సావిత్రి జీవిత గాథను తెర మీద ఆవిష్కరిస్తూ వచ్చిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో సావిత్రమ్మగా కీర్తి సురేష్ నటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.

రిలీజ్ నాడు ప్రీమియర్స్‌తో కలుపుకుని 1 మిలియన్ క్రాస్ చేయగా వారంలో ఈ సినిమా యూఎస్‌లో 2 మిలియన్ క్లబ్‌లో చేరింది. అంతేకాదు రిలీజ్ అయ్యి వారం దాటుతుండగా అమెరికాలో మరిన్ని సెంటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌ వారు ప్రొడ్యూస్ చేశారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.