మతిపోగొడుతున్న ట్విస్ట్: చరణ్ కీర్తికి అడ్డంగా నిలబడ్డ హీరోయిన్?

mahanati shocks rangasthalam
Tellmeboss.net

రిలీజ్ డేట్ విషయమై టాలీవుడ్‌లో ఓ ఆనవాయితీ ఉందన్న విషయం తెలిసిందే. అదే.. ఒక స్టార్ హీరో ఓ తేదీని బుక్ చేసుకుంటే, అదేరోజు మరో స్టార్ హీరో తమ సినిమాని రిలీజ్ చేయకూడదనేదే ఆ ఆనవాయితీ సారాంశం. ఒక్క పండగ సీజన్‌లో అయితే రిలీజ్ చేసుకోవచ్చు కానీ.. సాధారణ సమయాల్లో మాత్రం దాన్ని ఆచరించాల్సిందే! మొన్నటివరకు దీన్ని ప్రతిఒక్కరూ ఫాలో చేస్తూ వచ్చారు కానీ.. ఇప్పుడెందుకు మళ్ళీ పోటీకి దిగుతున్నారు. ఆల్రెడీ ఏప్రిల్ 27వ తేదీ కోసం ‘నా పేరు సూర్య’, ‘భరత్ అనే నేను’ యూనిట్‌ల మధ్య గొడవ జరుగుతోంది. ఇప్పుడు ‘మహానటి’ చిత్రబృందం కూడా రామ్‌చరణ్‌ని కెలికింది.

Tellmeboss.net

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సుకుమార్-చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాని మార్చి 29వ తేదీన రిలీజ్ చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు బలమైన న్యూస్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఆ డేట్‌ని మాత్రం బుక్ చేసుకున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇంతలోనే నిర్మాత అశ్వినీదత్ బాంబ్ పేల్చాడు. సావిత్రి రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘మహానటి’ బయోపిక్ చిత్రాన్ని మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ఆయన అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పుడు మెగాఫ్యాన్స్ ఆందోళనలో పడిపోయారు. ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే టెన్షన్ ఇప్పుడు వారిలో మొదలైంది.

ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమాని చాలా ఆలస్యం చేసేశారు. ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేయాల్సిందిపోయి.. ఏకంగా మార్చికి తీసుకెళ్ళి పడేశారు. ఇప్పుడేమో అదే సమయంలో ‘మహానటి’ వస్తోంది కాబట్టి.. దాంతో కయ్యానికి దిగుతారా? లేక మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తారా? అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ ‘రంగస్థలం’ టీం అఫీషియల్‌గా మార్చి 29వ తేదీని బుక్ చేసుకుని ఉండుంటే, ‘మహానటి’ బరిలోకి వచ్చేది కాదేమో! వాస్తవనాకి ‘మహానటి’ మూవీ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి కాబట్టి.. దాంతో క్లాష్ వద్దని చాలామంది కోరుకుంటున్నారు. మరి.. ‘రంగస్థలం’ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.