మూడు కొట్టిన మహానటి టీజర్

తెలుగులో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్స్‌లో ‘మహానటి’ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమాగా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు జనాలు. అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితకథలో తమకు తెలిసిన విషయాలు కాకుండా తెలియనివి ఏమున్నాయా అనే ఆసక్తితో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. కాగా ఈ సినిమా టీజర్‌ను రీసెంట్‌గా లాంఛ్ చేశారు చిత్ర యూనిట్.

మహానటి టీజర్‌ రిలీజ్ అవ్వడమే మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. సావిత్రిని మళ్లీ మన కళ్లముందు నిలబెట్టారా అనే విధంగా హీరోయిన్ కీర్తి సురేష్ గెటప్‌ నిలిచింది. ఈ సినిమాలో సావిత్రికి సంబంధించిన సినీ, వ్యక్తిగత జీవితాన్ని రెండింటినీ సమపాలల్లో చూపిస్తున్నట్లు మనకు టీజర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ టీజర్‌లో సావిత్రికి జిరాక్స్‌ కాపీలా కనిపించింది కీర్తి సురేష్. అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్ కూడా సావిత్రిని గుర్తుచేసే విధంగా ఉండటంతో ఈ టీజర్‌ను తెలుగు జనాలు ఎగబడిచూస్తున్నారు. దీంతో ఈ టీజర్‌కు అతితక్కువ సమయంలోనే 3 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి.

ఇలా ఒక హీరోయిన్‌ బయోపిక్‌ టీజర్‌కు ఇంతటి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత, విజయ్ దేవరకొండ, దల్కర్ సాల్మన్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.