లోగోతో ‘మహా’ సర్‌ప్రైజ్ అదిరింది!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో మహానటి కూడా ఒకటి. లెజెండరీ నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర యూనిట్ సావిత్రి జయంతి సందర్భంగా ఈరోజు చిత్ర టైటిల్‌ లోగోను రిలీజ్ చేశారు.

సావిత్రి నటించిన మాయాబజార్ చిత్రంలోని ప్రియదర్శిని కాన్సెప్టును తీసుకుని ఈ టైటిల్ లోగోను రివీల్ చేశారు చిత్ర యూనిట్. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు సావిత్రి సినిమాల్లోని కొన్ని డైలాగులు వినిపిస్తాయి. ఇక కీర్తి సురేష్ ఆ ప్రియదర్శినిని ఓపెన్ చేయడంతో ‘మహానటి’ లోగో మనకు చూపించారు చిత్ర యూనిట్. అదిరిపోయే మ్యూజిక్‌తో టైటిల్ ట్యూన్‌ ఉండటంతో ఈ టైటిల్ లోగో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

ఇక కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సమంత మరో కీలకమైన పాత్రలో నటిస్తోంది. అంతేగాక పలువురు నటీనటులు ఈ సినిమాలో మరిన్ని రోల్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మిస్తుండగా ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.