తారకే కావాలంటున్న ‘నటి’.. ఒత్తిడి తట్టుకోలేక పరార్

పాపం తారక్.. టాలీవుడ్‌ని ఏలుతున్న ఈ స్టార్ హీరో పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ‘నటి’ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక తీవ్ర ఆందోళనలో మునిగి తేలుతున్నాడు. ‘వద్దు మొర్రో’ అని గొంతు చించుకొని మొత్తుకుంటున్నా.. నువ్వే కావాలంటూ ఆ ‘నటి’ వెంటపడుతోంది. చివరికి ఒత్తిడి తట్టుకోలేక.. మనోడు యూఎస్ పారిపోయాడు.

మేటర్‌లోకి వస్తే.. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో తెలుగు ప్రజల ఆరాధ్యదైవుడు, తన తాత ఎన్టీరామారావు పాత్రలో నటించాల్సిందిగా యూనిట్ ఎప్పట్నుంచో తారక్‌ని రిక్వెస్ట్ చేస్తూ వస్తోంది. చైతూని సైతం ఏఎన్నార్ క్యారెక్టర్‌ పోషించాల్సిందిగా అడుగుతూ వస్తున్నారు. తొలుత ఈ ఇద్దరూ తమ తాత పాత్రల్లో నటించేందుకు ససెమిరా అన్నారు. కానీ.. ఆ ఇద్దరైతేనే కరెక్ట్‌గా సెట్ అవుతారని భావించి యూనిట్ వారి వెంట పడింది. వారి ఘోష తట్టుకోలేక చివరికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఏఎన్నార్ రోల్ పోషించడానికి రెండురోజుల కాల్షీట్లు కూడా ఇచ్చేశాడు.

చైతూ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ‘మహానటి’ యూనిట్ మళ్ళీ తారక్‌పై ఒత్తిడి పెంచింది. ఎన్టీఆర్ రోల్‌లో నటించమంటూ పదేపదే రిక్వెస్ట్ చేస్తూ వస్తోంది. తారక్ నుంచి రెస్పాన్స్ లేకపోయినా.. వీళ్ళు మాత్రం వదలట్లేదు. ఫ్యాన్స్ కూడా తారక్ నటించాలని గట్టిగా కోరుకుంటున్నారు కాబట్టి.. యూనిట్ అతడ్ని ఎలాగైనా ఒప్పించాలని మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం యూఎస్ టూర్‌లో వున్న తారక్.. ‘మహానటి’ యూనిట్ ప్రపోజల్‌కి పచ్చజెండా ఊపుతాడా? లేదా? వెయిట్ చేయాల్సిందే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.