మహానటి వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బయోపిక్ చిత్రంలో సావిత్రి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చూపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లవైపు ఎగబడ్డారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విధానం కూడా ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ములేపింది.

మహానటి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 44 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంతటి భారీ విజయం అందుకోవడంతో మహానటి చిత్ర టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాలో నటించిన దుల్కర్ సాల్మన్, సమంత, విజయ్ దేవరకొండలకు కూడా మంచి పేరు వచ్చింది. ఏరియాల వారీగా ఈ చిత్ర వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – వరల్డ్‌వైడ్ క్లోజింగ్ షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 11.9
సీడెడ్ – 2.85
ఉత్రరాంద్ర – 3.87
గుంటూరు – 2.13
కృష్ణా – 2.38
ఈస్ట్ – 2.45
వెస్ట్ – 1.62
నెల్లూరు – 0.9
టోటల్ ఏపీ+తెలంగాణ – 28.1
ఓవర్సీస్ – 11.2
కర్ణాటక – 2.25
రెస్టాఫ్ ఇండియా – 2.5
టోటల్ వరల్డ్‌వైడ్ – 44.05 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.