ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. శర్వా దెబ్బ అదుర్స్!

యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన మహానుభావుడు దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. వరుస సినిమాలతో శర్వా తన స్పీడును చూపిస్తూనే వాటిని బ్లాక్‌బస్టర్ చేసే దిశగా సాగిపోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో వచ్చి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన శర్వానంద్, మరోసారి అదే ఫార్మాట్‌లో వచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో సినిమా వసూళ్లు కూడా బాగున్నాయి. మహానుభావుడు చిత్రం ఫస్ట్ వీక్‌ పూర్తయ్యే సరికి రూ. 17.13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఏరియాల వారిగా మహానుభావుడు మొదటివారం కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 4.43
సీడెడ్ – 1.94
ఉత్తరాంధ్ర – 2.15
గుంటూరు – 1.35
తూర్పు గోదావరి – 1.30
పశ్చిమ గోదావరి – 0.79
కృష్ణా – 1.17
నెల్లూరు – 0.40
మొత్తం ఏపీ+తెలంగాణా – 13.53
రెస్టాఫ్ ఇండియా – 1.35
ఓవర్సీస్ – 2.25
టోటల్ వరల్డ్‌వైడ్ – 17.13 కోట్లు

Related posts:
బ్రూస్ లీ ఏరియా వైజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్‌
ఆ రొమాంటిక్ సీన్‌లో ఊపిరి పీల్చుకోలేకపోయానంటున్న జ్యోతి
‘ఖుషీ’ సీక్వెల్ స్టార్ట్.. కానీ ‘ముంబై’ వెనుక రహస్యం ఏంటి?
దుమ్ముదులిపిన ‘కబాలి’... ఇండియాలోనే నెంబర్ వన్
‘గ్యారేజ్’ టీజర్ మరో మైలురాయి.. ట్రెండ్ సెట్ చేసిన ఎన్టీఆర్
సెన్సార్ రిపోర్ట్ : కట్స్ లేకుండానే టచ్ చేసిన రవితేజ

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.