భరత్ కోసం మహేష్ 20 పెట్టాడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘భరత్ అనే నేను’’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అదరగొట్టేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు జనాలు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ఏకంగా 20 ప్లాన్ చేశాడు. ఇంతకీ ఈ 20 లెక్కేంటో చూద్దామా.

ప్రతి స్టార్ హీరో తమ సినిమాను వీలైనంత వరకు ప్రమోట్ చేయడానికి ఎలాంటి ఫీట్ అయినా చేస్తాడు. తాజాగా భరత్ అనే నేను చిత్రం కోసం మహేష్ బాబు తన క్యాలెండర్ నుండి 20 రోజులు కేటాయించాడు. ఈ 20 రోజులు పూర్తిగా భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్స్‌లోనే మహేష్ గడిపేస్తాడు. తన నెక్ట్స్ మూవీ పనులను కూడా ఇందుకోసం త్యాగం చేశాడు మహేష్. ఎలాగైనా భరత్ అనే నేనుతో మళ్లీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న మహేష్ ఈ సినిమాకోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యాడు.

మొత్తానికి ‘భరత్ అనే నేను’ మూవీపై మహేష్ ఏ రేంజ్‌లో నమ్మకం పెట్టుకున్నాడో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక సీఎం పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.