మోదీ దెబ్బకు ‘25’ పాట్లు పడుతున్న మహేష్

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ‘మహేష్25’ యూనిట్ ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుంది.. దాని ప్రకారమే షూటింగ్ కూడా మొదలెట్టింది. అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషించేలోపే.. ప్రధాని మోదీ రూపంలో గట్టి దెబ్బ తగిలింది. ఆయన కారణంగా నిర్విరామంగా జరపాల్సిన షూటింగ్‌ని అర్థంతరంగా ఆపేసి.. వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మేటర్‌లోకి వెళ్తే.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేస్తున్న 25వ సినిమా చిత్రబృందం తొలి షెడ్యూల్‌ని డెహ్రాడూన్‌లో ప్లాన్ చేసింది. దాని ప్రకారమే.. అక్కడ ఓ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ.. యోగా దినోత్సవం సందర్భంగా అక్కడ ప్రధాని మోదీ హాజరుకానుండడంతో ఆ ప్రాంతాన్ని నెలరోజుల ముందే బుక్ చేసుకున్నారు. మోదీ వస్తున్నారు కాబట్టి జనాలు కూడా భారీ సంఖ్యలో విచ్చేస్తారు. అందుకే.. మహేష్25వ యూనిట్ షూటింగ్‌ని నెలరోజులపాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మోదీ దెబ్బకు మహేష్ మూవీకి ఆటంకం కలిగింది.

మొదట్లో ఈ చిత్ర షూటింగ్‌ని డిసెంబర్‌లోనే కంప్లీట్ చేసి.. సంక్రాంతి సందర్భంగా జనవరిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ.. షూటింగ్ ఆలస్యం అవుతోంది కాబట్టి సమ్మర్ కానుకగా మార్చిలో దింపాలని మేకర్స్ ఫిక్సయ్యారు. పూగా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఓ కీలకపాత్ర పోషించనున్నాడు.

Related posts:
ర‌కుల్ దెబ్బ‌కు షాక‌య్యాడు..!
ఓవరాక్షన్ చేసిన ఫ్యాన్స్‌కి ఝలకిచ్చిన పాప్ సింగర్
కప్పు టీ అడిగిన పాపానికి మోడల్ తొడని కాల్చేశారు!
తండ్రి పాటలకు స్టెప్పులేసిన కూతురు, అల్లుడు.. కనువిందుగా జరిగిన శ్రీజ మెహందీ ఫంక్షన్ (వీడియో)
అడ్డం తిరిగిన బ్రహ్మానందం కథ.. తట్టాబుట్టా సర్దుకుని..
ఒకే యువకుడితో తల్లీకూతుళ్లు రొమాన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన తల్లి!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.