మహేష్ 25కి 1 మిక్స్ చేస్తానంటున్న లెక్కల మాస్టారు

‘రంగస్థలం’ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో చేస్తాడా? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిన్నటివరకు బన్నీతోనే చేయబోతున్నాడని ఓ వార్త తెగ హల్‌చల్ చేసింది. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఖాళీయే కాబట్టి.. అతనితో సెట్స్ మీదకి వెళ్దామని సుక్కు డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగిపోయాయని టాక్ నడిచింది. కానీ.. ఆ వార్తల్లో నిజం లేదని, సుక్కు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్‌తో చేయబోతున్నాడని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్‌ టాక్.

కెరీర్‌లో తొలిసారి ‘రంగస్థలం’ వంటి కమర్షియల్ చిత్రం తీసిన సుకుమార్.. తర్వాతి ప్రాజెక్ట్ మాత్రం తన మార్క్ స్టైల్లోనే తీయాలని ఫిక్స్ అయ్యాడట! తన దగ్గర ఆల్రెడీ 3 కథలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కన పెట్టి ఒక డిఫరెంట్ స్టోరీ తయారు చేస్తున్నాడట. ఈ స్టోరీకి ఎవరు సెట్ అవుతారా? అని ఆలోచిస్తున్న టైంలో సుక్కుకి మహేష్ పేరు తట్టిందట! ప్రయోగాలు చేయడంలో మహేష్ ఎప్పటికీ ముందుంటాడు కాబట్టి.. అతనైతేనే కరెక్ట్ అని భావించి సుక్కు సంప్రదించాడట! తన దగ్గరున్న స్టోరీలైన్‌ని వినిపించగా.. అది నచ్చి మహేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని.. వంశీ పైడిపల్లితో చేయనున్న 25వ ప్రాజెక్ట్ ముగియగానే దీన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మహేష్, సుక్కు కాంబోలో ఆల్రెడీ ‘1’ (నేనొక్కడినే) సినిమా వచ్చింది. అది విమర్శకుల ప్రశంసలైతే అందుకుంది కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. మహేష్‌కి ఓ భారీ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ బలమైన స్టోరీని సుక్కు ప్రిపేర్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే.. వీరి కాంబో సెట్ అయ్యిందా? లేదా? అనేది ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.