మహేష్ ‘బ్రహ్మోత్సవం’కు దెబ్బ..

Mahesh Babu Brahmotsavam

‘శ్రీమంతుడు’ ఘనవిజయం తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తదుపరి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా వున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. దానికి అనూహ్య స్పందన లభించింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేసినట్లు తెలిసింది. ఇందుకు కారణం.. షూటింగ్ ఆలస్యం కావడమేనని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్‌ని రీ-షూట్ చేస్తున్నారని, దాంతో మూవీ షెడ్యూల్స్ డిలే అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రబృందం ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీని మే 13వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈసారి ఈ మూవీ రిలీజ్ పక్కాగా మే 13వ తేదీనే వుంటుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

ఈ చిత్రాన్ని ప్రసాద్.వి పొట్లూరి భారీ బడ్జెట్టుతో పివిపి సినిమా బేనర్‌పై నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా.. ఈ సినిమా రిలీజ్‌ని రెండువారాలపాటు వాయిదా వేయడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనట్లు టాక్ వినిపిస్తోంది.

Related posts:
మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్‌బాబు.. స్టూడెంట్స్‌కి బహుమానం
ఒకే ఏడాదిలో 200 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్
టీజర్ టాక్ : ఆ ‘21 గ్రాముల సీక్రెట్’ ఏంటి చిన్నవాడా?
‘సాహసం శ్వాసగా సాగిపో’ 5 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
వివేకంతో వస్తున్న ట్రైలర్.. స్పైడర్ కోసం మహేష్ మాస్టర్ ప్లాన్!
‘గరుడవేగ’ 4 డేస్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. డిజాస్టర్ పక్కా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.