నాగ్ సంచలన కామెంట్స్.. హర్టయిన మహేష్-ఫ్యాన్స్

మన హీరోలు ఒక్కోసారి ఎగ్జైట్‌మెంట్‌లో నోరు జారుతుంటారు. కానీ.. అవే వారికి అతిపెద్ద సమస్యల్ని తెచ్చిపెడతాయి. ఇండస్ట్రీలో పెనుదుమారానికి దారితీస్తాయి. ఇప్పుడు నాగార్జున చేసిన వ్యాఖ్యల వల్ల అలాంటి హల్‌చలే పరిశ్రమలో రేకెత్తింది. ముఖ్యంగా మహేష్‌బాబు అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టాయి.

‘గూఢచారి’ సక్సెస్‌మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగ్.. ఆ చిత్రాన్ని తారాస్థాయిలో పొడుగుతూ, ఈ ఏడాది మూడు చిత్రాలే జెన్యూన్ హిట్స్‌గా నిలిచాయన్నారు. అవి రంగస్థలం, మహానటి, ఇక మూడోది గూఢచారి అని చెప్పారు. నాగ్ చేసిన ఈ వ్యాఖ్యలే పెద్ద వివాదానికి దారితీసింది. ఎందుకంటే.. భాగమతి, ఛలో, తొలిప్రేమ, ఆర్ఎక్స్100 సినిమాలు కూడా భారీ లాభాలు ఘనవిజయాలు సాధించాయి. ‘భరత్ అనే నేను’ భారీ ప్రాఫిట్స్ అయితే తెచ్చిపెట్టలేదు కానీ.. చివర్లో హిట్ కేటగిరీల్లో చేరిపోయింది.

ఇన్ని సినిమాలు హిట్టవ్వగా.. నాగ్ కేవలం మూడు చిత్రాల పేర్లే తీసుకోవడం ఆయా యూనిట్ వర్గాలకి, మహేష్ ఫ్యాన్స్‌కి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా సూపర్‌స్టార్ అభిమానులు నాగ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు సోషల్ మీడియాలో నాగ్‌ని టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తున్నారు. మరి.. ఈ వేడి వాతావరణంపై నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.