నీళ్లు దిగకుండా గొంతు పిసికేసిన మహేష్..!

mahesh-holds-balayya-film
Tellmeboss.net

ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కోసం గతకొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని మహేష్, బాలయ్య కాంబోని సెట్ చేయాలని.. ఆ ఇద్దరితో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

ఇప్పటికే ఆ ఇద్దరితో కలిసి, కథాచర్చలు కూడా జరిపేసిన ఈ దర్శకుడు బాలయ్యతో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. వరుస ఫ్లాపులతో కెరీర్ దెబ్బతిన్న టైంలో బోయపాటి భారీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు కాబట్టి.. ఆ అభిమానంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా బాలయ్య వెంటనే ఒప్పేసుకున్నారు. కానీ.. మహేష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పడేశాడు. నిజానికి.. స్టోరీ డిస్కషన్ టైంలో తనకు కథ నచ్చిందని బోయపాటికి మహేష్ చెప్పాడట. పూర్తి స్ర్కిప్ట్ తయారు చేయమని కూడా అన్నాడట. కానీ.. ఇప్పుడు మాత్రం ‘వెయిటింగ్ గేమ్’ ఆడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే.. నీళ్లు పోసినట్లే పోసి, గొంతులో దిగకుండా గట్టిగా పిసికేసినట్లు అతని వ్యవహారశైలి ఉందని అంటున్నారు. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం కూడా ఉందిలెండి!

Tellmeboss.net

‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో.. మహేష్ తన తదుపరి ప్రాజెక్టులపై చాలా జాగ్రత్త పాటిస్తున్నాడు. అందుకే.. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘భరత్ అనే నేను’ని సమ్మర్‌కి వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. స్ర్కిప్టులో కొద్దిపాటు మార్పులు చేయమని స్వయంగా మహేష్‌బాబే కొరటాలకి సూచించాడట. అలాగే.. వంశీ పైడిపల్లితో చేయనున్న 25వ ప్రాజెక్ట్‌పై కూడా మహేష్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే.. బోయపాటి విషయంలో మహేష్ పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తోంది. ‘భరత్ అనే నేను’ రిలీజ్ తర్వాత ఆ ‘మల్టీస్టారర్’కి తన అభిప్రాయం వెల్లడిద్దామని మహేష్ ఫిక్స్ అయ్యాడట. చివరికి ప్రిన్స్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.