ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించే న్యూస్.. ఎన్టీఆర్ మూవీలో మహేష్

టాలీవుడ్‌లో రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఒకటి! విశ్వవిఖ్యాత నటుడు, తెలుగు ఆరాధ్యదేవుడిగా చిరకాల గుర్తింపు సంపాదించిన ఆయన జీవితంపై సినిమా రూపొందుతుండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్‌కి అంతకింతకు పెంచే వార్తలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

ఎన్టీఆర్ జీవితంలో కీలకపాత్రలు పోషించిన వారితోపాటు ఆయనతో కలిసి పనిచేసిన కొందరు స్టార్ల పాత్రల కోసం వారి కుటుంబ హీరోలనే ఎంపిక చేసుకోవాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట! ఆల్రెడీ ఏఎన్నార్ పాత్ర కోసం నాగచైతన్యనని తీసుకోవాలని అనుకుంటున్నారట! ఇప్పటికే ‘మహానటి’లో ఏఎన్నార్ పాత్రలో మెరిసి.. అచ్చం ఆయనలాగే ఆకట్టుకోవడంతో.. అతనినే ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట! ఇక సూపర్‌స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్‌బాబుని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం!

అఫ్‌కోర్స్.. గతంలోనే ఈ వార్త వినిపించింది కానీ, క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కృష్ణ పాత్ర కోసం మహేష్‌ని బాలయ్య సంప్రదించగానే.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట! తనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. ఖచ్చితంగా ఈ మూవీకి మహేష్ క్రేజ్ కూడా తోడవుతుందని చెప్పుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.