రాజమౌళి ఆఫర్ చేసినా.. మహేష్ రిజెక్ట్?

ఈరోజుల్లో ట్యాలెంట్ ఉన్న చిన్న దర్శకులకే మన స్టార్ హీరోలు గోల్డెన్ ఆఫర్స్ ఇస్తున్నారు.. అలాంటిది ‘బాహుబలి’లాంటి మ్యాగ్నప్ ఓపస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌నే గడగడలాడించిన రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వస్తే వదులుకుంటారా? తమ బిజీ షెడ్యూల్స్‌ని సైతం పక్కనపెట్టేసి.. ఆయనకు కమిట్ అయిపోతారు. ఏదిఏమైనా.. మొదట జక్కన్నకే పెద్ద పీట వేస్తారు. కానీ.. మహేష్‌బాబు మాత్రం అంతగా ఆసక్తి చూపడన్నది టాలీవుడ్ టాక్! ఎందుకనుకుంటున్నారా? అందుకు మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. పదండి…

చిన్నప్పట్నుంచి తండ్రితో కలిసి సినిమాలు చేస్తున్న మహేష్.. హీరోగా మారిన తర్వాత అనతికాలంలోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ట్రేడ్‌లో తనకంటూ భారీ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ముఖ్యంగా.. ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిత్రాలతో తన స్టార్ పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఓవర్సీస్‌లో అందరికంటే ముందు తనే ఖాతా తెరిచాడు. మిలియన్ డాలర్ల సినిమాలతో అక్కడ ఊచకోత కోశాడు. ఇలా అడుగుపెట్టిన ప్రతిచోటా తన చక్రం తిప్పుతున్న మహేష్.. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. ‘పోకిరి’ టైంలోనే ఈ ప్రచారం మొదలైంది. ఆ చిత్రంతో టాలీవుడ్ రూపురేఖల్నే మార్చేశాడు కాబట్టి.. హిందీ పరిశ్రమలో పక్కా అడుగిడుతాడని భావించారు.

బహుశా ఈ ప్రచారం చూసే.. మహేష్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి అప్పట్లో సీక్రెట్‌గా ప్రణాళికలు రచించాడు. అతని భార్య నమ్రతా శిరోద్కర్ కూడా తన భర్తని గ్రాండ్‌గా హిందీ పరిశ్రమలో ఎంట్రీ చేయాలని.. అక్కడ తన సన్నిహితులతో చర్చలు కూడా జరిపింది. కానీ.. ఎందుకో తేడా కొట్టడంతో మహేష్ తొందరపడలేదు. అదంతా సేఫ్ కాదేమో అనుకుని మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. సరిగ్గా అదే టైంలో రామ్‌చరణ్ ‘జంజీర్’ రీమేక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడే మహేష్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ చూసి.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలా? వద్దా? అని అనుకున్నాడు. చివరికి ఆ మూవీ అతిపెద్ద డిజాస్టర్‌గా నిలవడంతో.. మహేష్ తన బాలీవుడ్ ప్లాన్‌ని క్యాన్సిల్ చేసుకున్నాడు.

అయితే.. ‘బాహుబలి’తో ప్రభాస్ హిందీలో ఎంట్రీ ఇవ్వడం.. ఆ మూవీ ఘనవిజయం సాధించి అతనికి ఇంటర్నేషన్ ఇమేజ్ తెచ్చిపెట్టడంతో.. మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల్సిందేనని మళ్ళీ తమ అభిప్రాయాల్ని వెల్లడించడం మొదలెట్టారు. అంత స్టార్‌డమ్ పెట్టుకుని.. ఎందుకు హిందీ మూవీ చేయట్లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం స్టార్ట్ చేశారు. కానీ.. మహేష్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. ‘జంజీర్’ ఫ్లాప్ అయ్యిందనో లేక తాను సక్సెస్ అవ్వలేనని భయమో తెలీదు కానీ.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ససెమిరా అంటున్నాడు మహేష్!

ఎందరో హీరోలు అక్కడ తమ చక్రం తిప్పుదామని ఫెయిన్ అయినవాళ్ళే! తన పరిస్థితి కూడా అదే అవుతుందన్న ఆలోచనతో మహేష్ తన బాలీవుడ్ డ్రీమ్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఇప్పుడు స్వయంగా రాజమౌళి దిగొచ్చి ‘మహాభారతం’లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్ చేసినా.. అది హిందీలో అయితే చచ్చినా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం! అదండి అసలు సంగతి!

Related posts:
ఆ హీరో త‌న‌కు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్న స‌మంత‌
‘గ్యారేజ్’ కోసం కొరటాల షాకింగ్ రెమ్యునరేషన్
షాక్ : అఖిల్ రెండో సినిమా నుంచి తప్పుకున్న వంశీ!!
‘గ్యారేజ్’ క్లైమాక్స్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్.. ‘కబాలి’లోలాగే?
‘శాతకర్ణి’ టీజర్‌పై ఎన్టీఆర్ అదిరిపోయే కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?
వర్మ దెబ్బకు బంగార్రాజును పట్టుకున్న నాగ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.