చరణ్-తారక్‌లని కాపీ కొట్టిన మహేష్

మన స్టార్ హీరోలందరూ లుక్స్ విషయంలో చాలాకాలం నుంచే విభిన్నతని ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కోరకంగా కనిపిస్తూ.. కండలు పెంచుతూ.. ఆడియెన్స్‌కి ‘కిక్’ ఇస్తున్నారు. కానీ.. ఒక్క మహేష్‌బాబు మాత్రం ఎప్పట్నుంచో ఒకే లుక్‌లో కనిపిస్తూ వస్తున్నాడు. ఈ విషయంపై మనోడి మీద విమర్శలొచ్చినప్పటికీ.. పెద్దగా పట్టించుకోకుండా తన రొటీన్ పంథాని కొనసాగిస్తూ వచ్చాడు. అయితే.. ఇన్నాళ్ళిలా అనుకున్న మహేష్, ఎట్టకేలకు కొత్త గెటప్ కోసం రెడీ అయిపోయాడు.

తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాలో కెరీర్‌లో ఎన్నడూ కనిపించని విధంగా గెడ్డం లుక్‌లో మాస్‌గా దర్శనమిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇది తెలిసిన విషయమే కదా? అని అనుకుంటున్నారా! ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లు మనోడి మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇందులో మహేష్ తన ఆరుపలకల్ని అంటే సిక్స్ ప్యాక్‌ని చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా తాను బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న ట్రైనర్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి ఈ గాసిప్ గుప్పుమంది.

ఇదివరకు మహేష్ గెడ్డం లుక్‌లో కనిపిస్తాడని వచ్చిన రూమర్ నిజమైంది కాబట్టి.. ఈసారి సిక్స్ ప్యాక్ వార్త కూడా వాస్తవమే అయి ఉంటుందని జనాలు బలంగా నమ్ముతున్నారు. పైగా.. చరణ్, తారక్‌లు కూడా ఇలాగే రీసెంట్‌గా తమ ట్రైనర్‌లతో పోజిచ్చి.. తమ కండల్ని చూపించినవాళ్ళే! రీసెంట్‌గా వీళ్ళ జాబితాలో మహేష్ కూడా చేరిపోయాడు కాబట్టి.. బహుశా ఈ సిక్స్ ప్యాక్ వార్త నజమయ్యే ఉండొచ్చు. అదే గనుక జరిగితే.. ఫ్యాన్స్‌తోపాటు సినీ లవర్స్‌ కోరిక తీరినట్టే!

Related posts:
ధోనీకి షాకిచ్చిన కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
కొడుకు చేసిన పనికి బన్నీ షాక్!!
షాక్ : కుర్రహీరోతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సల్మాన్ వదిన!
ఫ్లాష్ : మోడల్‌ని నమ్మించి రేప్ చేసిన ప్రముఖ దర్శకుడు
అక్కడ ఇంకా తగ్గని ‘జనతా గ్యారేజ్’ క్రేజ్
‘ఆ టైంలో నాన్న చాలా బాధపడేవారు’.. ‘చిరు’రహస్యంపై సుస్మీత ఓపెన్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.