మనసుకు నచ్చింది మూవీ రివ్యూ – రేటింగ్

చిత్రం: మనసుకు నచ్చింది
దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
మ్యూజిక్ డైరెక్టర్: రధన్
సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
నిర్మాత: పి.కిరణ్-స్వరూప్
బ్యానర్: ఆనంది ఆర్ట్స్
నటీనటులు: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసురాలు, ప్రిన్స్ మ‌హేష్ బాబు సోద‌రి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా మారి చేసిన సినిమా ‘మనసుకు నచ్చింది’. గ‌తంలో ఓ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తరువాత నటిగా బిజీ అయ్యారు. ఇప్పుడు ‘‘మనసుకు నచ్చింది’’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు డైరెక్టర్‌గా మారి వ‌చ్చారు. పైగా వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న సందీప్ కిష‌న్‌తో ఆమె తీసిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ మనసుకు నచ్చిందో రివ్యూలో చూద్దాం!

కథ:
సూరజ్ (సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తూర్‌) చిన్నప్పట్నుండి మంచి స్నేహితులు. ఒకే కుటుంబంలో కలిసి పెరిగిన వీరిద్దరి స్నేహాన్ని ప్రేమగా భావించి వీరిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తారు కుటుంబ సభ్యులు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్య వాదిస్తారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ ఇంట్లో నుంచి గోవాకు పారిపోతారు. త‌మ స్నేహితుడు శరత్ (ప్రియదర్శి) స‌హాయంతో వీరిద్దరు గోవాలో ఉంటారు.

కట్ చేస్తే.. సూర‌జ్ కెరీర్‌ పరంగా సెటిల్ కావాలనుకుంటాడు. ఫోటోగ్రాఫర్‌గా సెటిల్ అవుదామని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతడికి నిత్య ధైర్యం చెబుతూ ఉండటంతో అతడు అనుకున్నది సాధిస్తాడు. ఈ క్రమంలో నిత్యకు సూరజ్‌పై ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ గోవాలో సూర‌జ్‌కు నిక్కి (త్రిదా చౌదరి) అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌డంతో తనను ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్‌ (అదిత్‌ అరుణ్‌) అనే వ్య‌క్తి నిత్యను ఇష్టపడతాడు. ఈ విధంగా ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌డంతో సూర‌జ్‌-నిక్కి, నిత్య‌-అభ‌య్‌కు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే చివ‌రికి పెళ్లి ఎవ‌రెవ‌రికి అవుతుందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
ఇద్దరు స్నేహితులు.. ఒకరంటే మరొకరికి ఇష్టం. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడం. ఈ విషయం తెలుసుకునే సమయానికి ఏదో ఒక అడ్డంకి రావడం. చివరికి వారు కలుసుకుంటారా లేదా అనే చాలా పాత కాన్సెప్ట్‌తో ‘మనసుకు నచ్చింది’ సినిమాను తెరకెక్కించింది మంజుల ఘట్టమనేని. అయితే ఈ కథలో ఎమోషన్స్‌ను పండించి సదరు ప్రేక్షకుడికి నచ్చేలా చేయాలని ప్రయత్నించింది దర్శకురాలు. ఈ కథకు ప్రకృతితో సంబంధం కలిపి ఒక కొత్త ప్రయోగం చేయాలని చూసింది మంజుల. కానీ ఇప్పటికే ఇలాంటి చాలా సినిమాలు తెలుగు జనాలు చూసేసారు. దీంతో ఈ సినిమా కూడా రొడ్డకొట్టుడు సినిమాలాగే మనకు కనిపిస్తుంది.

ఏ ఒక్క అంశంలో కూడా ఈ సినిమా సదరు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. ఒక్క సినిమాటోగ్రఫీ మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం.. కథనం కూడా సీరియల్ మాదిరిగా సాగదీయడంతో ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌లో టైటిల్ కార్డుల దగ్గర్నుండి ఇంటర్వెల్ వరకు ఎక్కడా కూడా ఆసక్తిగా ఉండకపోవడంతో ఆడియెన్స్ తలలు పట్టుకున్నారు. పోనీ సెకండాఫ్‌లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సెకండాఫ్‌ సాగుతుంది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. మొత్తానికి ఈ కథ కేవలం మంజుల ‘‘మనసుకు మాత్రమే నచ్చింది’’గా మిగలడం ఖాయం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సందీప్‌ కిషన్ తన ప‌రిధి మేర‌కు పర్వాలేదనిపించాడు. కొత్తగా మనోడి దగ్గర్నుండి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏమీ లేదు. వరుస ఫెయిల్యూర్స్ వస్తున్నాయనే బెంగతో ఈ సినిమాలో కూడా చాలా నీరసంగా నటించి చిర్రెత్తించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో మనోడి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేకపోతారు. అమైర దస్తర్‌ అందంతో ఆకట్టుకోవ‌డంతో పాటు నటనలో మంచి మార్కులు కొట్టేసింది. త్రిదా చౌదరి గ్లామర్‌కే పరిమితమైంది. ప్రియదర్శి హీరో ఫ్రెండ్‌‌గా ఓకే అనిపించుకున్నాడు. కానీ పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేకపోవడం మైనస్ అని చెప్పాలి. ఇతర పాత్రలు సినిమాలో ఉండాలి కాబట్టి కనిపిస్తాయి.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
జాతీయ అవార్డు అందుకున్న మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా ఇలాంటి సినిమా తీస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఒక రొటీన్ కథను ఎంచుకోవడంలోనే ఆమె ట్యాలెంట్ మనకు తెలిసిపోతుంది. నేచర్ అనే అంశాన్ని రొటీన్ కథకు జోడించి ఎమోషన్స్‌తో నెట్టుకురావాలనే ఆమె ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని కథను ఎంచుకుని, సాగదీసే కథనంతో దర్శకురాలిగా తొలిసినిమానే ఫెయిల్యూర్‌గా మిగిలించుకుంది. అయితే సినిమాలో మెచ్చుకోద‌గ్గ విష‌యం రవి యాదవ్ సినిమాటోగ్రఫి. గోవా ప్రకృతి అందాలను సినిమాలో అందంగా చూపించారు. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా: ‘మనసుకు నచ్చింది’ – ప్రేక్షకులకు పిచ్చెక్కింది!

నేటిసినిమా రేటింగ్: 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.