పెళ్లియ‌న హీరోయిన్‌తో మంచు విష్ణు రొమాన్స్‌!!

manchu vishnu romance

manchu vishnu new film details

డైనమైట్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘సరదా’. ఈ సినిమాలో విష్ణు స‌ర‌స‌న జాదూగాడు ఫేం సోనారిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ సోనారిక‌తో పాటు మ‌రో హీరోయిన్ క‌నిపించ‌నుంది. క‌థ‌లో కీల‌క‌మైన ఈ పాత్ర‌కు ప్ర‌ముఖ హీరోయిన్‌; డైరెక్ట‌ర్ విజ‌య్‌మిల్ట‌న్‌ను పెళ్లాడిన అమ‌లాపాల్‌ను ఎంపిక చేశారు.

అమలా పాల్ గతంలో తెలుగులో చెర్రీతో నాయక్, బ‌న్నీతో ఇద్దరమ్మాయిలతో సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత అమలా పాల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అమ‌లాపాల్-విష్ణు మ‌ధ్య తెర‌మీద వ‌చ్చే రొమాన్స్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని తెలుస్తోంది.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.