మందిరా చేతిలో ప్రభాస్ పెళ్లి

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’ షూటింగ్‌‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు జాయిన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటిస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ మందిరా బెడీ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ స్పై పాత్రలో మనకు కనిపిస్తాడు. ఇక మనోడితో తలబడేందుకు గుంపులుగా ఉన్నారు ఇందులో విలన్స్. వీరిలో మందిరా బెడీ కూడా ఒకరు. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న మందిరా బెడీ ఈ విధంగా నెగెటివ్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆతృత మొదలైంది జనాల్లో. ఇక బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీని యువీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.