మేడ మీద అబ్బాయి రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Meda Meedha Abbayi Movie Review

దర్శకత్వం : జి. ప్రజీత్
నిర్మాత : బొప్పన్న చంద్రశేఖర్
సంగీతం : షాన్ రహమాన్
నటీనటులు : అల్లరి నరేష్, నిఖిల విమల, హైపర్ ఆది తదితరులు

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం మేడ మీద అబ్బాయి. వరుస సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నరేష్ సినిమా అంటే జనాల్లో ఆసక్తి తగ్గింది. ఇలాంటి టైమ్‌లో మరో కొత్త సినిమాతో మనముందుకు వచ్చాడు నరేష్. ఈసారి ఓ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నా అని నరేష్ ధీమాగా ఉన్నాడు. మరి ఈసారైనా అతడు హిట్ కొడతాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమాల్లో తన ప్రతిభ చాటుకోవాలనే కోరికతో హైదరాబాద్ వస్తాడు శ్రీను(అల్లరి నరేష్). ఈ క్రమంలో అనుకోకుండా ట్రెయిన్‌లో సింధు(నిఖిల విమల్) అనే అమ్మాయితో ఓ సెల్ఫీ దిగుతాడు మనోడు. అతడిక ఈ సెల్ఫీ వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటీ? అసలు సింధు ఎవరు? శ్రీను అతడి సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక చిన్న పాయింట్‌ను పట్టుకుని రెండు గంటలకు పైగా దానినే చూపించిన ఈ సినిమాతో అల్లరి నరేష్ తన ఫ్లాప్ పరంపరను కొనసాగిస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌ నుండి బయటపడాలని చూస్తున్న అల్లరి నరేష్ ఏమాత్రం పట్టులేని కథతో మరోసారి పల్టీ కొట్టాడు. సోషల్ మీడియాతో జరిగే చెడును చూపించే పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అతడు ఎలాంటి స్పూఫ్స్ లేకుండా చేసి కొంతవరకు మార్కులు కొట్టేశాడు. సినిమా ఫస్టాఫ్ అంతా కూడా చాలా జాలీగా సాగిపోతుంది. అల్లరి నరేష్ అతడి ఫ్రెండ్స్ ముఖ్యంగా హైపర్ ఆదితో కలిసి చేసే కామెడీ థియేటర్‌లో కొంతవరకు నవ్వులు పూయించాయి. ఎవరు ఏది చెప్పినా నమ్మే నరేష్ పాత్రకు, తన గొప్పతనం కోసం ఫ్రెండ్ ను ఇరికించే ఆది పాత్రకు బాగా సింక్ అయింది. ఇక హీరో హీరోయిన్ తో తీసుకున్న ఒక సెల్ఫీ మూలాన తీవ్రమైన ఇబ్బందుల్లో పడటమనే పాయింట్ బాగుంది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ఈ చిన్నపాటి ట్విస్ట్ కొంత ఎగ్జైటింగా అనిపించింది.

ఈ సినిమాను మోసం చేసిన అంశం సెకండాఫ్ అని చెప్పాలి. సాగదీసే విధంగా ఉన్న సీన్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని మొత్తం లాగేస్తాయి. కథ తీసుకునే ట్విస్టుల్లో ఒక్క చోట కూడా సరైన, బలమైన కారణం కనిపించదు. దీంతో సదరు ప్రేక్షకుడికి చాలా బోర్ కొట్టేస్తుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ పరమ చెత్తగా ఉండటం కూడా సినిమాకు మేజర్ మైనస్ పాయింట్. అవసరాల శ్రీనివాస్‌ పాత్రకు అనవసర ట్విస్టులు, ఎలివేషన్లు పెట్టి డిజప్పాయింట్ చేశారు. ఓవరాల్‌గా సినిమా క్లైమాక్స్‌ కంప్లీట్ చేసుకునే వరకు ఇదే తరహాగా ఫీల్‌ అవుతారు ఆడియెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అల్లరి నరేష్ ఈ సినిమాపై చాలా హోప్ పెట్టుకున్నాడు. అయితే కధనం బాగా లేకపోవడంతో అతడి యాక్టింగ్‌తో కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఈ సినిమాలో తన రొటీన్ స్పూఫ్‌లను వాడకపోయినా అల్లరి నరేష్ కొత్తగా ట్రై చేసింది ఏమీ లేకపోవడంతో చూసేవారికి కాస్త నిరాశే మిగిలింది. ఒక జబర్దస్త్ ఫేం హైపర్ ఆది తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నిఖిల్ విమల్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగతా వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ప్రజీత్ ఎంచుకున్న కథనం కొత్తగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల్లో ఆదరణ పొందలేకపోయింది. కథలో పస లేకపోవడం, సింగిల్ పాయింట్‌ మీద సినిమా మొత్తం లాగించేయడంతో సరైన ఔట్‌పుట్ రాబట్టడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక కుంజుని ఎస్. కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ పని ఇంకాస్త బాగుండాల్సింది. షాన్ రహమాన్ సంగీతం పర్వాలేదు. బొప్పన్న చంద్రశేఖర్ నిర్మాణ విలువలు తక్కువ బడ్జెట్లో పర్వాలేదనిపించాయి.

చివరిగా:
మేడ మీదనుండి కిందకు జారిపడ్డ అబ్బాయి!

నేటిసినిమా.కామ్ రేటింగ్ : 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.