2018 లో మెగా హీరోల బిజినెస్ షాకింగ్ రిపోర్ట్ !!

తెలుగు సినీ పరిశ్రమ లో హిట్లు , ప్లాప్ లతో సంబంధం లేకుండా మెగా హీరోలకుండే క్రేజే వేరు. గత సినిమాల జయాపజయాలతో పోల్చుకోకుండానే వారి ప్రస్తుత కాంబినేషన్ల ఆధారంగానే బిజినెస్ జరుగుతుంటుంది. గత సంవత్సరం చిరంజీవి రీఎంట్రీ తర్వాత మెగా హీరోల సంఖ్య 7 కు చేరింది.2018 లో విడుదలకి సిద్దమవుతున్న ఈ 7 గురు మెగా హీరోల సినిమాల బిజినెస్ వివరాలు మొత్తం ట్రేడ్ వర్గాలని సైతం షాక్ కి గురి చేస్తున్నాయి. చిరంజీవి నుండి మొదలుకొని అల్లు శిరీష్ వరకు మెగా హీరోల రాబోయే సినిమాలు మరియు వాటి బిజినెస్ పూర్తి వివరాలు మీకోసం :

మెగాస్టార్ చిరంజీవి : చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 గత సంవత్సరం సంక్రాంతి కి విడుదలై బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించి 150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి నాన్ బాహుబలి రికార్డులని తిరగరాసింది. ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి దాదాపు పది నెలల సమయం తీసుకొన్నాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రామ్ చరణ్ నిర్మాత గా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహరెడ్డి షూటింగ్ లో రీసెంట్ గా పాల్గొంటున్నాడు. ఇక ఈ చిత్రం బిజినెస్ వివరాలకొస్తే బడ్జెట్ దాదాపుగా 150 కోట్ల కి పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఇంకా ఎక్కువైనా తగ్గేది మాత్రం లేదని రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమా కి 300 కోట్లకి పైగా బిజినెస్ జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ : పవన్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టనప్పటికీ.. త్రివిక్రమ్ దర్శకత్వం లో సంక్రాంతి కి వస్తున్న అజ్ఞాతవాసి సినిమా కి దాదాపుగా 100 కోట్ల కి పైగా బిజినెస్ జరగటం విశేషం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ : మగధీర సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ బొమ్మ రామ్ చరణ్ నుండి రాలేదనే చెప్పాలి.రెండు వరుస వైఫల్యాల తరువాత ధ్రువ తో తన సత్తా చాటి మళ్ళి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చిన రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 1985 తో 2018 లో మన ముందుకి రాబోతున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ దాదాపు 80 కోట్లు జరిగింది.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ : సరైనోడు , దువ్వాడ జగన్నాధం హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అల్లు అర్జున్ రైటర్ వక్కంతం వంశి దర్శకత్వం లో ‘నా పేరు సూర్య’ అంటూ 2018 లో సందడి చేయనున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా 80 కోట్ల కి పైగా జరిగింది.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ : తొలి మూడు సినిమాలతోటే బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలని సృష్టించి తక్కువ సమయంలో మెయిన్ లీగ్ లోకి వచ్చిన సాయి గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేక పోయాయి. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం లో వస్తున్న సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ : ఫిదా తో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ వెంకట్ అట్లూరి దర్శకత్వం లో చేస్తున్న తొలిప్రేమ సినిమాకి దాదాపు 20 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

అల్లు శిరీష్ : శ్రీరస్తు శుభమస్తు తో మంచి హిట్టు కొట్టిన అల్లు శిరీష్ డిసెంబర్ 28 2017 న ఒక్క క్షణం సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్టుకొట్టిన వి ఐ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు 15 కోట్ల వరకు జరగనుందని అంచనా వేస్తున్నారు.

ఇక మొత్తం వెరసి 2017-2018 లో మెగా హీరోల బిజినెస్ 625 కోట్ల రూపాయలు జరగనుందని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం తెలుగు సినిమా బిజినెస్ దాదాపుగా 2000 కోట్లు.. అంటే 30% కి పైగా మెగా హీరోల నుండే ఈ సంవత్సరం బిజినెస్ జరగనుండటం విశేషం.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.