మెహబూబా రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

సినిమా: మెహబూబా
దర్శకుడు: పూరీ జగన్నాధ్
ప్రొడ్యూసర్: పూరీ జగన్నాధ్
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: ఆకాష్ పూరీ, నేహా శెట్టి, మురళి శర్మ తదితరులు

తెలుగులో క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాధ్. పూరీ సినిమా వస్తుందంటే యూత్ మొత్తం థియేటర్స్‌ వైపు పరుగులు పెట్టేవారు. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్‌తో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్న ఈ డైరెక్టర్ ఆ తరువాత వరుసగా ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకుని ఫేడ్ అవుట్ అయ్యాడు. పూరీ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో మనోడు ఏం చేసినా ఫ్లాపే అనే విధంగా తయారయ్యింది పరిస్థితి. కాగా ఇప్పుడు తాజాగా పూరీ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
రోషన్(ఆకాష్ పూరీ) చిన్నప్పట్నుండీ చాలా పద్దతిగా, క్రమశిక్షణతో పెరుగుతాడు. సైనుకుడిగా బోర్డర్‌లో పనిచేస్తుంటాడు రోషన్. కాగా లాహోర్ నుండి చదువుల కోసం ఇండియాకు వస్తుంది ఆఫ్రీన్(నేహా శెట్టి). ఆఫ్రీన్‌ను చూసిన రోషన్ ఆమెను ప్రేమిస్తాడు. ఏదిఏమైనా తన ప్రేమను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇంతలోనే ఇండియా-పాక్ యుద్ధం వస్తుంది. ఇలాంటి వాతావరణంలో తన ప్రేమను రోషన్ ఎలా సాధించుకుంటాడు..? వీరి లవ్ స్టోరీ కేవలం ఒక్క తరానికే సంబంధించిందా లేక వీరు చనిపోయి మళ్లీ పుడతారా..? అనేది అసలు కథ.

విశ్లేషణ:
ఒక మంచి లవ్‌స్టోరీని వార్ నేపథ్యంలో చాలా బాగా చూపించాడు పూరీ. తన చిత్రాల్లో మనకు కనిపించే ప్రేమకథకు మెహబూబా చిత్రంలోని ప్రేమకథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న పూరీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు వార్ ఎపిసోడ్స్‌ను జోడించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసాడు ఈ డైరెక్టర్. ఇక మెహబూబా చిత్రం ఫస్టాఫ్ మొత్తం పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడంలోనే సాగిపోయింది. రోషన్‌గా హీరో పాత్రను చాలా ఇంప్రెసివ్‌గా చూపించాడు పూరీ. తన చిత్రాల్లో హీరోలు చాలా వరకు పోకిరీలుగా ఉంటారు. కానీ మెహబూబా హీరో మాత్రం చాలా పద్దతిగా ఉంటాడు. చదువు కోసం ఇండియా వచ్చిన ఆఫ్రీన్‌‌ను రోషన్ ఎలా ఇంప్రెస్ చేశాడు అనే పాయింట్ బాగుంది. కొన్ని ఆసక్తికరమైన సీన్స్ తరువాత ఒక అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వస్తుంది.

సెకండాఫ్‌లో యుద్ధానికి సంబంధించిన సీన్స్‌ను హైలైట్ చేశాడు దర్శకుడు పూరీ. ఈ క్రమంలో రోషన్ ఆఫ్రీన్‌ను ఒక ప్రమాదం నుండి ఎలా బయటపడేస్తాడు.. దీంతో ఆమె ప్రేమను దక్కించుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన రోషన్ దానిని ఎలా సాధించాడు అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులకు కథను పరిచయం చేస్తూ, సెకండాఫ్‌లో అసలైన కథను ఎలివేట్ చేసిన విధానం మనకు మరోసారి పూరీ మార్క్ గుర్తుకు తెస్తుంది. అయితే మెహబూబా చిత్రంలో మనకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇది పూరీ మార్క్‌కు కాస్త విభిన్నం అనే చెప్పాలి. మొత్తానికి పూర్తి లవ్‌స్టోరీ సినిమాతో మెహబూబా చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించిన పూరీ మరోసారి ఇంప్రెస్ చేసాడు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
చిన్నతనం నుండే యాక్టింగ్ చేస్తూ కెమెరాకు అలవాటు పడిపోయిన ఆకాష్ పూరీ హీరోగా మెప్పించాడు. యాక్టింగ్‌లో మంచి నైపుణ్యతను ప్రదర్శించిన ఆకాష్ పూరీ, రోషన్ పాత్రలో ఒదిగిపోయాడు. అదిరిపోయే డైలాగ్ డెలివరీ, ఆకట్టుకునే పర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్‌కు మరో యంగ్ హీరోగా ఆకాష్ పూరీ మెప్పించాడు. ఇక కొత్త పిల్ల నేహా శెట్టి తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అమ్మడి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆకాష్ పూరీ, నేహా శెట్టిల మధ్య కెమిస్ట్రీ సగటు ప్రేక్షకుడికి బాగా నచ్చుతుంది. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
మెహబూబా చిత్రం గురించి మాట్లాడాలంటే మనం ముందుగా పూరీ జగన్నాధ్ గురించే ప్రస్తావించాల్సి వస్తుంది. ఈ చిత్రం కేవలం పూరీ మార్క్‌పైనే క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతలా ఈ చిత్రంపై హైప్ తీసుకువచ్చిన పూరీ ఈ సినిమాను అంతే అందంగా తెరకెక్కించి మరోసారి తాను ఏంటో నిరూపించుకున్నాడు. కథ, కథనాల్లో పూరీ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. తనదైన టేకింగ్‌తో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశాడు పూరీ. సందీప్ చౌతా మ్యూజిక్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెజారిటీ వార్ సీన్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో చేసినా కెమెరా పనితనం అదిరిపోయింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరిగా:
మెహబూబా – పూరీ మార్క్ వార్ అండ్ లవ్!

నేటిసినిమా రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.