‘మర్సల్’ వరల్డ్‌వైడ్ ఫైనల్ కలెక్షన్స్.. 111%తో చరిత్ర సృష్టించిన విజయ్

mersal total worldwide final collections

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసిన ‘మర్సల్’ మూవీ చివరికి తన దూకుడుని ఆపేసింది. ఓవైపు వివాదాలను, మరోవైపు బరిలో వున్న సినిమాలకు ధీటుగా భారీ పోటీనిస్తూ.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా టోటల్ రన్‌లో రూ.126.7 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇక గ్రాస్ విషయానికొస్తే.. రూ.244.8 కోట్లు అని తేలింది. ఇది సౌత్ ఇండస్ట్రీలోనే 5వ బిగ్గెస్ట్ గ్రాసర్. కోలీవుడ్‌లో మూడో బిగ్గెస్ట్ గ్రాస్, నాన్-రజినీ రికార్డ్.

నిజానికి.. ఈ సినిమా సబ్జెక్ట్ అంత గొప్పదేమీ కాదు. ఆసుపత్రు స్కామ్‌ల చుట్టే స్టోరీ నడుస్తుంది. ఇలాంటి కథతో ఇదివరకే చాలా సినిమాలొచ్చాయి. అయినా ఇది ఈ రేంజులో ప్రభంజనం సృష్టించడానికి కారణం.. విజయ్ క్రేజ్‌తోపాటు ఇందులోని డైలాగ్స్ పెద్ద వివాదానికి దారితీయడమే. ఆ డైలాగ్సే ఈ మూవీకి విపరీతమైన ప్రమోషన్స్ తీసుకురావడంతో.. ఇది రికార్డుల పరంపరని కొనసాగించింది. ఇక ఏరియాలవారీగా కలెక్షన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

తమిళనాడు : 68.40
కేరళ : 6.80
కర్ణాటక : 5.90
ఏపీ+నైజాం : 5.40
రెస్టాఫ్ ఇండియా : 1.90
టోటల్ ఇండియా : రూ.88.40 కోట్లు (గ్రాస్ రూ.167 కోట్లు)
యుఎస్/కెనడా : 10.25
మలేషియా : 5.95
సింగపూర్ : 4.60
శ్రీలంక : 2.33
యూకే : 2.32
ఫ్రాన్స్ : 1.70
ఆస్ట్రేలియా/న్యూజిల్యాండ్ : 1.25
ఇతర ఏరియాలు : 2.90
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ.126.7 కోట్లు (గ్రాస్ రూ.244.8 కోట్లు)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.