కర్ణుడికి కృష్ణోపదేశం.. అదిరిపోయే సందేశం!

మహాభారత యుద్ధం గురించి తెలియని భారతీయుడు ఉండరు. మరి ముఖ్యంగా పంచపాండవుల్లో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం ప్రతి హిందువు తన దైనిక జీవితంలో పాటిస్తుంటాడు. ఈ గీతోపదేశం అర్జునుడికి చేసిన విధంగానే కౌరవులతో చేయి కలిపిన కర్ణుడికి కూడా శ్రీకృష్ణుడు ధర్మసందేశం చేశాడు. ఈ ఉపదేశం కురుక్షేత్ర యుద్ధం జరగకముందు కర్ణుడు శ్రీకృష్ణుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ప్రతి ఒక్క మనిషి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి.

కర్ణుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా అడిగాడు..‘‘కృష్ణా.. నా చిన్నతనంలోనే నన్ను కన్నతల్లి వదిలేసింది. ఆమెకు అక్రమసంతానంగా పుట్టడం నేను చేసిన తప్పా..? నాకు చిన్నతనంలో విద్యాభ్యాసం ఇవ్వడానికి గురువులు ద్రోణాచార్యులు నిరాకరించారు. అందుకు కారణం నేను క్షత్రియుడిని కాదని. నాకు విద్యనందించిన పరశురాముడు నేను క్షత్రియుడిని అని నేను నేర్చిన విద్యను మొత్తం మర్చిపోయేలా శపించాడు. నేను అనుకోకుండా విసిరిన బాణం వెళ్లి ఓ గోవుకు తగలడంతో అది మరణించింది. దీంతో ఆ గోవు యజమాని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలోనూ నన్ను అవహేలన చేశారు. చివరికి కుంతీ మాత కూడా తన పుత్రులను కాపాడుకునేందుకే నా తల్లి అనే సత్యాన్ని చెప్పింది. దుర్యోధనుడు చూపించిన ఉదారతతోనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. మరి నేను అతడి కోసం యుద్ధం చేయడంలో తప్పేముంది..?’’ అని కర్ణుడు తన ధర్మసందేహాన్ని శ్రీకృష్ణుడి ముందుంచాడు.

అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు కర్ణుడి ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చాడు..‘‘ హే కర్ణ.. నేను ఒక కారాగారంలో జన్మించాను. నా పుట్టుకకు ముందే నా చావు నా మామ రూపంలో ఎదురుచూసింది. పుట్టిన వెంటనే నేను తల్లిదండ్రులకు దూరమయ్యాను. నీవు ఆయుధాలు, గుర్రపు స్వారీల మధ్యన పెరిగావు. కానీ నేను గోవులు, గొర్రెలు నడుమ పెరిగాను. ఊహ తెలియకముందే నాపైన హత్యాయత్నాలు జరిగాయి. నా వల్లే నా చుట్టూ ఉన్న ప్రజలకు అపాయం జరిగిందని నన్ను దూషించేవారు. నీ శౌర్యం గురించి తోటి విద్యార్ధులతో పాటు నీ గురువులు సైతం మెచ్చుకున్నారు. కానీ నాకు ఎలాంటి విద్యాభోదన లేదు. నీకు నచ్చిన అమ్మాయినే నీవు మనువాడావు. కానీ నేను ఇష్టపడిన అమ్మాయిని(రాధా) వదులుకొని నన్ను కోరుకున్న వారిని, నేను కాపాడిన వారిని వివాహమాడాను. జరాసంధుడి బారినుండి నా ప్రజలను కాపాడేందుకు వారిని ఉన్న చోటునుండి తరలించాను. కానీ వారు నన్ను ఓ పిరికివాడని దూషించారు. దుర్యోధనుడు యుద్ధం గెలిస్తే నీకు గుర్తింపు లభిస్తుంది. కానీ ధర్మరాజు గెలిస్తే ఈ యుద్ధానికి కారణం నేనే అని శాపనార్ధాలు పెడతారు. జీవితంలో ఒక్కటి గుర్తించుకో కర్ణ.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవరోధాలు ఉంటాయి.. వాటిని దాటి వెళ్లేవారికే జీవించే హక్కు ఉంటుంది!’’

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.