‘సైరా’కి బాహు వాయింపుడు.. బలి అవ్వడం ఖాయం!

mm keeravani to give music for sye raa

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందించాలనే ఉద్దేశంతో.. భారీ తారాగణంతోపాటు బాగా పేరుమోసిన టెక్నీషియన్లను సైతం సెలెక్ట్ చేసుకున్నాడు.

అయితే.. కొన్ని కారణాల వల్ల సినిమా స్టార్ట్ కాకముందే టెక్నీషియన్స్ ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. మొదట కెమెరామెన్ రవివర్మ తప్పుకోగా.. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ బిజీ షెడ్యూల్ వల్ల తప్పుకున్నాడు. దీంతో.. అతని స్థానంలో మోషన్ పోస్టర్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ఎస్ థమన్నే సంగీత దర్శకుడిగా యూనిట్ తీసుకోవచ్చని అంతా భావించారు. కానీ.. తనక్కూడా పిలుపు రాలేదని థమన్ ఫ్యాన్స్‌తో లైవ్‌లో ఇంటరాక్ట్ అయినప్పుడు కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ఈ ప్రాజెక్ట్‌కి ఎవరు సంగీతం అందిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే.. త్వరలోనే ఈ ప్రశ్నకి సమాధానం రానుందని సమాచారం. ఎందుకంటే.. యూనిట్ తమక్కావాల్సిన సంగీత దర్శకుడ్ని చూసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల వార్తల ప్రకారం.. సైరా టీమ్ కీరవాణిని సంప్రదించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జోనర్‌కి తగ్గట్టు పాటలు అందించడంలో కీరవాణి దిట్ట! ‘బాహుబలి’ సిరీస్‌కి ఆయన అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు.. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమ చిత్రానికికూడా మంచి సంగీతం ఇస్తాడనే ఆలోచనతో ఆయన్నే తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. దాదాపు ఆయనకే ‘సైరా’ పగ్గాలు ఇప్పించే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితే.. మరోసారి ‘బాహుబలి’ స్థాయి మ్యూజిక్ వినే ఛాన్స్ దక్కుతుంది. మరి.. యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.