పవన్ పాలిటిక్స్‌పై మోహన్‌బాబు ‘మౌన’రాగాలు

ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఒకరు. అవతలి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో వున్నా సరే.. తన మనసులో వున్న అభిప్రాయాల్ని బేఫికర్‌గా బయటపెట్టేస్తారు. రాజకీయాల గురించి కూడా అంతే! ఎవరెలా అడుగులు వేస్తున్నారు? ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనే విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడి.. పలు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తారు. అలాంటి ఆయన తొలిసారి మౌనం పాటించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రస్తుతం మోహన్‌బాబు తన కొత్త చిత్రం ‘గాయత్రి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే.. ఆయన మాత్రం ఏ ప్రశ్నకీ సమాధానం ఇవ్వకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతానంటూ తేల్చిచెప్పారు. అయినా మీడియా వదలకుండా రాజకీయ ప్రశ్నలే సంధిస్తోంది మీడియా. లేటెస్ట్‌గా ఓ ప్రముఖ ఛానెల్ అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై మాట్లాడాల్సిందేనంటూ గట్టిగా పట్టుబట్టింది. కానీ.. మోహన్‌బాబు మాత్రం ససేమిరా అనేశారు. ‘‘మీరు ఎంత గింజుకున్నా సరే.. ఇప్పుడు నేను పవన్ గురించి గానీ, ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేను. సినిమాల గురించి ఏమైనా అడగండి.. రాజకీయాలు మాత్రం వద్దు’’ అని స్పష్టం చేశారు.

అయినా ఆ ఛానెల్‌కి ఏదో ఒక సంచలనం కావాలి కాబట్టి.. గత పుండుకు కాస్త కారం చల్లింది. దానిపై కూడా నీళ్ళు చల్లి, మోహన్‌బాబు కూల్ చేశారు. గతంలో చిరంజీవి పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా మోహన్‌బాబును ఉద్దేశించి పవన్ ‘తమ్ముడూ మోహన్ బాబూ’ అని సంబోధించిన విషయాన్ని మీడియా మళ్ళీ తెరమీదకి తీసుకురాగా.. దాన్ని తాను ఆ రోజు సరదాగానే తీసుకున్నానని.. పవన్ అలా అన్నందుకు సంతోషించానని మోహన్ బాబు చెప్పారు. తర్వాత అతను అలా ఎందుకు అన్నాడా అని ఆలోచించానని.. ఆపై ఆ విషయాన్ని పవన్ విజ్ఞతకే వదిలేశానని మోహన్ బాబు అన్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.