‘నా నువ్వే’ ట్రైలర్ రివ్యూ : ‘ఇదేం ట్విస్ట్ నాయనా’

నందమూరి కళ్యాణ్ రామ్ వరుసబెట్టి చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘నా నువ్వే’ ఒకటి! సినిమా మొదలైన దగ్గర్నుంచి స్టైలిష్ ఫోటోలు రిలీజ్ చేస్తూ.. సినిమాపై బజ్ పెంచుకుంటూ వస్తోంది యూనిట్. అదే టైంలో ఒక చిన్న ట్విస్ట్‌తో కూడిన ఒక కలర్‌ఫుల్ టీజర్ కూడా రిలీజ్ చేసి.. మూవీపై ఆసక్తి పెంచింది. ఇప్పుడు లేటెస్ట్‌గా థియేట్రికల్ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. పదండి.. దీని విశేషాలేంటో తెలుసుకుందాం!

ఇది ఒక ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ అని ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది. ఓ సందర్భంలో కళ్యాణ్‌ని తమన్నా చూసి.. మొదటిచూపులోనే ప్రేమలో పడుతుంది. ఇక అప్పట్నుంచి వేట మొదలెట్టి.. చివరికి అతనితో పరిచయం ఏర్పరుచుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివసించడం, సరదాగా జీవితం గడపడం జరుగుతుంది. కానీ.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తమన్నా ప్రేమని కళ్యాణ్ సీరియస్‌గా తీసుకోడు. ఆ ఉద్దేశంతోనే ఆమెకి దూరం అవుతాడు. చివరికి తమన్నా ప్రేమ గురించి తెలుసుకుని.. ఆమెను కలిసేందుకు కళ్యాణ్ ప్రయత్నిస్తాడు. ఈ జర్నీ ఎలా సాగింది? ఈ టైంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనే అంశాల చుట్టే సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

ఈ ట్రైలర్‌ మొత్తంలో అంతా ప్రేమే ఉంది. ఒక్క చోట మాత్రమే వెన్నెల కిషోర్ పేల్చే ‘ట్విస్ట్’ డైలాగ్ కాస్త నవ్వించింది. ఇందులో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మునుపెన్నడూ లేని స్టైలిష్ గెటప్‌లో అదరగొట్టేశాడు. తమన్నా కూడా చాలా అందంగా, సెక్సీగా కనువిందు చేసింది. బ్యాక్‌గ్రౌండ్ థీమ్ ఫర్వాలేదు. విజువల్స్ అయితే కళ్ళుచెదిరిపోయేలా ఉన్నాయి. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్‌కి ప్రత్యేక ఆకర్షణ. కాకపోతే.. ఓవరాల్‌ ట్రైలర్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. దీనికి నేటిసినిమా ఇచ్చే రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.