‘నా పేరు సూర్య’ ఇంపాక్ట్ రివ్యూ-రేటింగ్.. ఆ రూమర్లకి బుల్లెట్ దిగింది!

naa peru surya first impact review rating
Tellmeboss.net

ఒక యూనిట్ తమ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్‌గానీ, టీజర్‌గానీ రిలీజ్ చేస్తోందని ప్రకటన చేస్తే చాలు.. విడుదల అవ్వడానికి ముందే అవి అలా ఉంటాయి, అది చూపిస్తారంటూ తండోపతండాలుగా రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. స్వయంగా చిత్రబృందమే చెప్పినట్లుగా తెగ హంగామా చేసేస్తాయి కొన్ని వెబ్‌సైట్లు. బహుశా నిజమేనేమో అనిపించేలా అవి ప్రభావం చూపుతాయిలెండి. సేమ్ ఇలాగే ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్‌కి ముందువరకు కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో బన్నీకి ఒక్క డైలాగ్ కూడా ఉండదని, బన్నీని కూడా తక్కువగా చూపిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఈ రూమర్లకి బుల్లెట్ దింపుతూ స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ఇంపాక్ట్‌తో అదరగొట్టేశాడు. నూతన సంవత్సరానికి ఎనర్జిటిక్ గిఫ్ట్‌తో ఆడియెన్స్‌ని కట్టిపడేశాడు.

Tellmeboss.net

‘హూ ఆర్ యు.. అనే మాటతో మొదలయ్యే ఈ ఇంపాక్ట్ యాక్షన్‌తో నిండి ఉంది. బన్నీ గన్ పట్టుకుని బుల్లెట్ దింపిన దగ్గర నుంచి కోపిష్టిగా కనిపిస్తూ దొరికినవాడ్ని రప్ఫాడించేశాడు. మధ్యలో రెండు సెకన్లపాటు రొమాంటిక్ షాట్ కనిపించింది కానీ ఇంతలోనే టీజర్‌ మరో మలుపు తిరిగింది. బన్నీ ఏదో తప్పు చేయడం, దానికి అతను శిక్ష అనుభవించడం జరుగుతుంది. చివర్లో ‘బార్డర్‌కెళ్లి చచ్చిపోతాను’ అనే గూస్‌బంప్స్ డైలాగ్‌తో ఇది ముగుస్తుంది. పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉన్న ఈ టీజర్‌లో బన్నీ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్ముదులిపేశాడు. మిలిటరీ మ్యాన్ పాత్రకి ప్రాణం పోసేశాడు. ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. వంశీకి తొలిచిత్రమే అయినా.. టేకింగ్‌తో శభాష్ అనిపించాడు. ఓవరాల్‌గా.. ఈ ఇంపాక్ట్‌ జనాల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. దీనికి నేటిసినిమా ఇచ్చే రేటింగ్ : 3.5/5.

Tellmeboss.net
Related posts:
కుర్ర హీరోయిన్‌పై మ‌హేష్ ప్ర‌శంస‌ల జ‌ల్లు
‘సోగ్గాడే’తో ఆ కోరిక తీరిందన్న నాగార్జున
రాజ్ తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీ రివ్యూ, రేటింగ్ & విశ్లేషణ
ప్రభాస్ నెక్ట్స్.. హీరోయిన్, విలన్ ఫిక్స్
ఫస్ట్‌లుక్ టాక్: స్టైలిష్ లుక్‌లో ‘ఖైదీ’ గెటప్ అదరహో!
అప్పుడే ‘బాహుబలి-2’ రికార్డ్‌ని బ్రేక్ చేసింది!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.