నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

సినిమా : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
బ్యానర్ : రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ
సంగీతం : విశాల్‌ – శేఖర్‌
నిర్మాత : లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు
నటీనటులు : అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యూయేల్‌, అర్జున్‌, శరత్ కుమార్‌, బొమన్‌ ఇరానీ, రావు రమేష్‌

వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. స్టార్ రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా డైరెక్టర్‌గా మారి చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. యాంగ్రీ యంగ్ ఆర్మీ సోల్జర్‌గా బన్నీ నటిస్తున్న ఈ సినిమా మరి ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
సూర్య(అల్లు అర్జున్) ఆర్మీలో సోల్జర్‌గా ట్రెయినింగ్ తీసుకుంటున్న యువకుడిగా మనకు కనిపిస్తాడు. అతడి కోపం కారణంగా పలుమార్లు సీనియర్ ఆఫీసర్స్‌తో క్లాస్ తీసుకుంటూ పనిష్‌మెంట్ కూడా అనుభవిస్తాడు. ఈ క్రమంలో ఒకసారి ఒక ఎమ్మెల్యే కొడుకును సూర్య కొట్టడంతో అతడిని ఆర్మీ నుండి బయటకు పంపించేస్తారు హయ్యర్ అఫీషియల్స్. అయితే ఒక్క ఛాన్స్ ఇస్తే తాను మారిపోతానని చెబుతాడు సూర్య.

ఈ క్రమంలో అతడు మెంటల్‌గా ఫిట్‌గా ఉన్నానని వైజాగ్‌లోని ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణం రాజు(అర్జున్) దగ్గర నుండి సర్టిఫికెట్ తీసుకురమ్మంటారు అతడి అఫీషియల్స్. దీంతో తన కోపాన్ని కంట్రోల్ చేయాలని సైకాలజిస్ట్ షరతు మేరకు తన పంథాను మార్చుకుంటాడు సూర్య. అయితే ఈ క్రమంలో సూర్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటాడు? రామకృష్ణం రాజుతో సూర్యకు సంబంధం ఏమిటీ? వైజాగ్‌ను ఏలుతున్న చల్లా(శరత్‌కుమార్)తో సూర్య ఎందుకు గొడవపడతాడు? తన క్యారెక్టర్‌ను పక్కనబెట్టిన సూర్య తిరిగి ఆర్మీలో చేరుతాడా లేడా? అనేది వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో మనకు ఈ చిత్రంలో కనిపించాడు. వక్కంతం వంశీ రాసుకున్న కథను ప్రెజెంట్ చేసిన విధానానికి బన్నీ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరోమో అనే విధంగా ఈ చిత్రంలో నటించాడు. ఇక కథ పరంగా చూస్తే ఈ సినిమాలో వావ్ అనిపించే అంశం ఏమీ లేకపోయినా బన్నీ వన్ మ్యాన్ షో‌ ఈ చిత్రానికి బాగా తోడయ్యింది. ఫస్టాఫ్‌లో బన్నీ ఇంట్రొడక్షన్ నుండి ఇంటర్వెల్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాగా నడిపించాడు దర్శకుడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్‌తో బన్నీ లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. ఈ క్రమంలో వచ్చే మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ అని చెప్పాలి. తన క్యారెక్టర్‌ను మార్చుకునేందుకు బన్నీ ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కుంటాడా అనే ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

ఇక సెకండాఫ్‌లో బన్నీ తనను తాను మార్చుకునే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మనకు కనిపిస్తాయి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా యాడ్ చేశాడు దర్శకుడు. అయితే వీటి కారణంగా సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా మనకు అనిపిస్తుంది. దీనికి తోడు అను ఇమ్మాన్యుయెల్‌తో వచ్చే ట్రాక్ మరోసారి ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. అయితే ప్రీ-క్లైమాక్స్‌లో బన్నీ మళ్లీ తన ఒరిజినల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. అటు క్లైమాక్స్‌ను కూడా మంచి పాయింట్‌తో ముగించాడు దర్శకుడు వంశీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:
యంగ్ యాంగ్రీ సోల్జర్‌గా బన్నీ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. సరికొత్త లుక్‌లో బన్నీ తన ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు. కోపంతో రగిలిపోయే కుర్రాడిగా బన్నీ యాక్టింగ్ ‌పీక్స్. తనను తాను మార్చుకునే క్రమంలో బన్నీ ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామకృష్ణ రాజుగా అర్జున్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో చల్లాగా శరత్ కుమార్ బాగానే చేశాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్‌కు పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోవడంతో అమ్మడి పాత్ర వృథాగా పోయింది. మిగతా నటీనటులు తమ పరిధిమేరకు బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే వెరైటీ టైటిల్‌తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే తాను రాసుకున్న కథను ఇంకాస్త బెటర్‌గా చూపించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో నిలిచేది. పూర్తిగా దేశభక్తి నింపుకున్న యాంగ్రీ యంగ్ సోల్జర్‌ తన క్యారెక్టర్‌ను ఒత్తిడిలో మార్చుకుంటాడా అనే కాన్సెప్టుతో వంశీ రాసుకున్న కథ బాగుంది. దీనిని అతడు ప్రెజెంట్ చేసిన విధానం సూపర్. రాజీవ్ రవి అందించిన సినిమాటోగ్రాఫీ చిత్రానికి బాగా తోడయ్యింది. బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సూపర్‌గా నిలిచింది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూ్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా చూపించారు.

చివరిగా: నా పేరు సూర్య – బన్నీ వన్ మ్యాన్ షో!

రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.