ఏడిట్లో వస్తున్న నా పేరు సూర్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా మనకు కనిపిస్తాడు. ఇక ఈ చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ చిత్రం ఎప్పెడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. కాగా ఈ చిత్ర యూనిట్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

వక్కంతం వంశీ అదిరిపోయే కథను ఈ చిత్రానికి అందించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా జాతీయ సమైక్యతను చేకూర్చడంలో మంచి విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఈ చిత్రాన్ని ఏకంగా ఏడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలి, మరాఠీ, భోజ్‌పురీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో బన్నీ సరసన అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో రిలీజ్ చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.