యాక్షన్ కాదు.. రెజ్లింగ్ చేస్తున్న సూర్య!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భీబత్సమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు చిత్ర యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక రేంజ్‌లో ఉండనున్నాయి. వీటిని చూస్తే మనకు WWF రెజ్లింగ్ ఇట్టే గుర్తుకు వస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఆ రేంజ్‌లో చాలా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయట. ఈ చిత్రానికే అవి హైలైట్‌గా నిలుస్తాయిని బన్నీ అండ్ టీమ్ అంటున్నారు. ఇక ఈ సినిమాతో బన్నీ మరోసారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటాడని ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్.

బన్నీ ఒక సరికొత్త లుక్‌లో నటిస్తున్న నా పేరు సూర్య చిత్రంలో మలయాళ గుమ్మ అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్-శేఖర్ సంగీతం అందిస్తుండగా శ్రీధర్ లగడపాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 22న, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో నిర్వహించాలని చూస్తున్నారు. కాగా మే 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు చిత్ర యూనిట్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.