నా పేరు సూర్య వరల్డ్‌వైడ్ ఫైనల్ కలెక్షన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వేసవి కానుకగా రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా నిలిచింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న బన్నీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా ఫస్ట్ సక్సెస్‌ను అందుకోవాలని చూశాడు.

కానీ ఈ సినిమా తొలిరోజునే ప్రేక్షకుల దగ్గర్నుండి తీవ్ర విమర్శలకు లోనయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు తొలిరోజే నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో కేవలం రూ. 53 కోట్లకుపైగా కలెక్ట్ చేయడంతో నిర్మాతలు భారీ నష్టాలను చవిచూసారు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 12.60
సీడెడ్ – 6.85
వైజాగ్ – 5.35
ఈస్ట్ – 3.70
వెస్ట్ – 2.85
కృష్ణా – 2.65
గుంటూరు – 3.90
నెల్లూరు – 1.65
టోటల్ ఏపీ+తెలంగాణ – 39.55
ఓవర్సీస్ – 2.04
కర్ణాటక – 6.05
తమిళనాడు – 2.50
కేరళ – 2.25
రెస్టాఫ్ ఇండియా – 1.31
టోటల్ వరల్డ్‌వైడ్ – 53.7 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.