తారక్28 : కన్ఫ్యూజన్‌లో పడేసిన నాగబాబు

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న 28వ చిత్రం ‘అరవింద సమేత’పై ఇప్పటికే ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలుసు! తొలిసారి ఈ జంట జతకట్టడం, ఫ్యాక్షన్ నేపథ్యం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడా ఆసక్తిని మరింత పెంచేలా అటు పిక్స్‌ లీకవ్వడంతోపాటు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కూడా బయటకొస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మొన్న తారక్-నాగబాబు కలిసి వున్న ఒక ఎమోషనల్ పిక్ లీకైన దగ్గర్నుంచీ.. ఇందులో నాగబాబు పాత్ర ఏంటనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇందులో నాగబాబు ఒక గ్రామ సర్పంచ్‌గా కనిపించనున్నట్లు టాక్. అంటే.. రాయలసీలో వుండే ఒక గ్రామానికి ఆయన పెద్ద అన్నమాట! ఈ వార్త నిజమో కాదో తెలీదు కానీ.. దాదాపు ఇదే అయ్యుండొచ్చని గట్టి వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే టైంలో మరో టాక్ కూడా నడుస్తోంది. బహుశా ఎన్టీఆర్‌కి తండ్రి పాత్రలో నాగబాబు నటిస్తున్నారేమోనని, అందుకే లీకైన పిక్‌లో ఇద్దరి మధ్య ఎమోషన్ అంతలా పండి వుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా.. నాగబాబు రోల్ ఇందులో చాలా స్ట్రాంగ్‌గా వుందనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే రోల్ ఏంటన్నదే మిస్టరీ! ఇది రివీల్ అవ్వాలంటే.. సినిమా రిలీజయ్యేంతవరకూ వెయిట్ చేయాల్సింద! పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.