ఎన్టీఆర్ స్ట్రోక్‌కి చైతూ పరార్..?

ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యనే ఎంపిక చేయనున్నట్లు గతకొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతూనే వున్నాయి. ‘మహానటి’ చిత్రంలో చైతూ తన తాతలాగే మెరిసి మార్కులు కొట్టేయడంతో.. ఖచ్చితంగా అతడ్ని సెలెక్ట్ చేసుకుంటారని అనుకున్నారు.

కానీ.. దర్శకుడు క్రిష్ మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. చైతూని పక్కనపెట్టేసి.. సుమంత్‌ని ఎంపిక చేశాడు. అఫ్‌కోర్స్.. ‘మహానటి’లో ఏఎన్నార్‌గా చైతూ పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయినా, సుమంత్ అయితేనే ఇంకా బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో క్రిష్ అతడినే ఎంపిక చేసుకున్నాడట! పైగా.. బాలయ్య పక్కన చైతూ మరీ యంగ్‌గా కనిపిస్తాడు. అదే సుమంత్ అయితే సరిగ్గా మ్యాచ్ అవుతాడని.. చైతూని కాకుండా అతడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లు అనిపిస్తోంది.

ఇకపోతే.. ఇందులో ఇతర కీలకపాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రాసెస్ పూర్తైన వెంటనే.. షూటింగ్ మొదలుపెట్టనున్నారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ బయోపిక్‌ని జనవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.