డిసెంబర్‌లో ‘ఛలో’ అంటున్న నాగశౌర్య

విభిన్న క‌థాంశాల‌తో వరుస విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు హీరో నాగ‌శౌర్య. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఇటీవలే ఛలో అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

నాగశౌర్య తల్లితండ్రులయిన నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో డిసెంబర్ 18న ఛలో టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఛలో చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మీడియా సమావేశంలో నిర్మాతలు తెలియజేశారు.

మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగశౌర్యకు ఛలో సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related posts:
బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ల డిక్టేటర్ సినిమా రివ్యూ రేటింగ్ విశ్లేషణ
బాలయ్యతో లింకు పెట్టుకున్న నిర్మాత
‘రైట్ రైట్’ అంటూ అందరికీ షాకిచ్చిన సాయిధరమ్ తేజ్
రన్‌టైంతో భయపెడుతున్న సూర్య.. 24 సినిమాకు ఎదురుదెబ్బా??
బన్నీ-మహేష్‌‌ల బస్తీమే సవాల్.. తగ్గేదే లేదు!
టీజర్ టాక్: దిల్ ఉంటే గుంపుగా రమ్మంటున్న కాలా!!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.