ట్రైలర్ టాక్: ఛలో తెలుగు-తమిళ కొట్లాట!

యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛలో’ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్స్‌తో జనాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా వరుస వాయిదాలతో జనాల్లో అంచనాలను కోల్పోయింది. కానీ ఈ చిత్రంలో మేటర్ ఉందంటూ నిరూపించింది ఈ చిత్ర ట్రైలర్. తాజాగా ఛలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగశౌర్య మరో హిట్‌ను కొట్టడం ఖాయం అని అనిపిస్తోంది.

ఈ ట్రైలర్‌ మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో జనాలు ఛలో ట్రైలర్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో తెలుగు-తమిళనాడు బార్డర్‌లో ఈ కథ సాగుతున్నట్లు.. అక్కడ ఇరువురి మధ్య జరిగే గొడవకు అసలు కారణం ఏమిటో తెలుసుకునే పనిలో పడతాడు హీరో. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకునే పరిణామాలే ఈ కథలో మనకు చూపిస్తున్నాడు నాగశౌర్య. ఇక ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్నాడు హీరో. కమెడియన్ వెన్నెల కిషోర్‌తో పాటు సత్య తదితరులు కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యారు.

నాగశౌర్య అదిరిపోయే గెటప్‌తో మనల్ని ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక మందన తన అందంతో కుర్రకారుకి పిచ్చెక్కించేందుకు రెడీ అయ్యింది. వెంకీ సిరికొండ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు చిత్ర యూనిట్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.