నాని గాలి తీసేసిన నాగార్జున

nagarjuna akkineni reacts on hello mca box office clash
Tellmeboss.net

ఇండస్ట్రీలో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని క్రేజ్ ఏ రేంజులో ఉందో అందరికీ తెలుసు. అసలు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సాధించని ఫీట్‌ని అందుకుని.. ఈ హీరో చరిత్ర సృష్టించాడు. అదే.. వరుసగా ఏడు హిట్లు! దీంతో ఇతనికి స్టార్ హీరో రేంజ్ వచ్చేసింది. అతనికి పోటీగా సినిమాల్ని రిలీజ్ చేయాలంటే.. మీడియం స్థాయి హీరోలు కూడా జంకుతారు. రెండు రోజుల వ్యవధి లేదా వారంరోజుల గ్యాప్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అలాంటి క్రేజ్ ఉన్న నానిని ‘కోడిగుడ్డపై ఈకలాగా’ నాగార్జున తీసిపడేశారు. కాకపోతే.. ఆయన పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారులెండి!

Tellmeboss.net

అఖిల్ రెండో చిత్రం ‘హలో’ని నాగార్జున తన సొంత బ్యానర్ ‘అన్నపూర్ణ స్టూడియోస్’పై నిర్మించిన విషయం తెలిసిందే! రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఆయన ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగ్‌కి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘హలో డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతోంది. అంతకుముందురోజే నాని నటించిన ‘ఎంసీఏం’ చిత్రం కూడా విడుదల కాబోతోంది. ఈ క్లాష్‌పై మీ అభిప్రాయం ఏంటి? నాని చిత్రం ‘హలో’పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు నాగ్ చాలా కూల్‌గా జవాబిచ్చారు. నాని తమకు ఏమాత్రం పోటీ కాదని, అసలు ఇలా ఒకేసారి రిలీజ్ అవ్వడం పోటీయే కాదంటూ సూపర్బ్‌గా మాట్లాడారు.

నాగ్ మాట్లాడుతూ.. ‘‘నాని కూడా చాలా పాపులర్. జనరల్‌గా పోటీ ఉండదని నా అభిప్రాయం. అంతెందుకు.. సంక్రాంతి పండుగకి ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాన్ని ఎవరూ పోటీ అనుకోవడం లేదే. అయినా మన తెలుగు రాష్ట్రాల్లో సరిపోయే థియేటర్స్ చాలానే ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదని అనుకుంటున్నా’’ అని నానితో ఉన్న పోటీపై నాగ్ సింపుల్‌గా చెప్పేశారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.