ఆఫీసర్ కోసం నాగ్ ‘డబ్బుల డ్రామా’!

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ‘ఆఫీసర్’ సినిమా రూపొందుతోందని విషయం తెలిసిన కొత్తలో.. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కాంబినేషన్ చాలాకాలం తర్వాత ఒక్కటైనందుకు.. ఈసారి కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేయగలరా? లేదా? అనే క్యూరియాసిటీ ఏర్పడింది.

కట్ చేస్తే.. శ్రీరెడ్డి ఇష్యూలో వర్మ తలదూర్చడంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. యావత్ తెలుగు ప్రజలు ఆయనకు వ్యతిరేకం కావడంతో.. ‘ఆఫీసర్’కి దెబ్బ పడింది. అప్పటివరకూ ఆ మూవీపై వున్న అంచనాలన్నీ బోల్తాపడ్డమే కాకుండా మరింత నెగెటివిటీ వచ్చిపడింది. ఈ చిత్రం రిలీజ్‌కి నోచుకుంటుందా? లేదా? అనే డౌట్ నెలకొనే పరిస్థితి దాకా వ్యవహారం వచ్చింది. చివరికి పరిస్థితులన్నీ సద్దుమణగడంతో వ్యతిరేకత రానురాను తగ్గుతూ వచ్చింది. కానీ.. ఆ చిత్రంపై క్రేజ్ మాత్రం ఏర్పడలేదు. అసలు ఈ సినిమా వస్తోందనే హడావుడి ఏమాత్రం లేదు.

అదిచూసి.. ఈ సినిమా బిజినెస్ జరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి. ఇంతలోనే.. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఏపీ ఏరియాలన్నింటికీ గాను ఫ్యాన్సీ రేట్లకు రైట్స్ కొనుగోలు చేయడం ఆశ్చర్యమేసింది. అప్రతిష్టపాలు మూటగట్టుకున్న ఈ సినిమా బిజినెస్ ఎలా జరిగిందా? అనే అనుమానాలు రేకెత్తాయి. తెరవెనుక ఏదో డ్రామా ఉండే ఉంటుందని ఆరాతీయగా.. చివరికి ఆ రహస్యం బట్టబయలైంది. మొత్తం వెనుకుండి నాగార్జున తతంగం నడిపించాడని అసలు సీక్రెట్ తెరమీదకి వచ్చింది.

నైజాం ఏరియాలో వర్మ సొంతంగా రిలీజ్ చేసుకుంటుండగా.. ఇతర ఏరియాల వ్యవహారంలో నాగ్ జోక్యం చేసుకున్నాడు. నాగ్‌కి అత్యంత సన్నిహితుడైన కామాక్షి అధినేత శివప్రసాద్‌కి కృష్ణా జిల్లా హక్కులు అప్పగించాడు. ఇక మిగతా ఏరియాల బిజినెస్ కూడా తన భరోసా మీదే నాగ్ చేయించాడు. పెద్దగా నష్టం వాటిల్లకుండా గిట్టుబాటు ధరలకే డీల్స్ చేయించినట్లు తెలిసింది. సో.. నాగ్ వల్లే ఈ చిత్రం బిజినెస్ చేయగలిందన్నమాట!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.