ఓంకార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాజుగారి గది-2’. ఇది గత హిట్ సినిమాకి సీక్వెల్ కాదు కానీ.. టైటిల్ సేమ్ కావడంతో మొదటినుంచే క్రేజ్ వచ్చింది. ఇక ఈ క్రేజ్‌కి మామాకోడళ్లైన నాగార్జున-సమంత స్టార్ స్టేటస్లు తోడవ్వడంతో ఈ చిత్రంపై మంచి అంచానలే నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్లతో ఈ చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈ చిత్రం కచ్ఛితంగా హిట్ అవుతుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.
ఇక తాజాగా అందుతున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇది నిజంగానే హిట్ అవుతుందని పక్కా సమాచారం అందుతోంది. గత చిత్రంలోకంటే ఇందులో ఎక్కువ కామెడీ డోస్ దట్టించేయడంతోపాటు హారర్ ఎలిమెంట్స్ కూడా బాగా వున్నాయని.. అలాగే ఓ ఆత్మ చెందే ఆవేదనని కూడా ఎమోషనల్‌గా టచ్ అయ్యేలా హైలైట్ చేశారని.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రం అద్భుతంగా వుందని టాక్ వినిపిస్తోంది. ఆడియెన్స్ కచ్ఛితంగా ఈ గదిలో బందీలైపోతారని వార్తలొస్తున్నాయి.
ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ హాలిడేస్ కోసమని గోవాకి వెళ్తారు. బీచ్‌కి దగ్గరగా వుండే ఓ ఫ్లాట్ తీసుకుంటారు. అక్కడ వాళ్లకి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చివరికి ఫ్లాట్‌లో దెయ్యం వుందని తెలుస్తుంది. దాన్నుంచి విముక్తి పొందడం కోసం మెంటలిస్ట్ అయిన నాగ్ని సంప్రదించగా.. అతను రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఫ్లాట్‌లో వున్న ఆ ఆత్మ ఎవరిది? ఆమె జీవిత చరిత్ర ఏంటి? ఆ ఫ్లాట్‌తో ఆ ఆత్మకి వున్న లింక్ ఏంటి? దీని బారినుంచి నాగ్ ఫ్రెండ్స్ బ్యాచ్‌ని ఎలా విముక్తి కల్పిస్తాడు? అనే అంశాలతో ఈ సినిమా కథ అల్లుకుని వుంటుందట.
ఫస్టాఫ్‌లో చాలావరకు కామెడీని హైలైట్ అయ్యిందట. ఫ్రెండ్స్‌తో కాసేపు నవ్వులు పూయించి, ఆ తర్వాత వారికి-దెయ్యానికి మధ్య కొన్ని సీన్స్‌తో కడుపుబ్బా నవ్వించడంతోపాటు భయపెట్టేశాడట ఓంకార్. ఇక నాగ్ ఎంట్రీ తర్వాత కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుందని, ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముగుస్తుందంటున్నారు. సెకండాఫ్‌లోనూ నాగ్ దెయ్యాన్ని అదుపులోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, దాని జీవిత చరిత్రతో కథ సాగుతుందట. చివరికి ఓ మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్ చిత్రం ఎండ్ అవుతుందని చెప్తున్నారు.
నాగ్ మెంటలిస్ట్‌గా చాలా బాగా నటించాడని, సమంత దెయ్యం పాత్రకి పూర్తి న్యాయం చేసిందని అంటున్నారు. ఓంకార్ తమ్ముడు, వెన్నెల కిషోర్, షకలక శంకర్లతోపాటు ఇతర కమెడియన్లు కడుపుబ్బా నవ్వించారని, ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి బాగానే నటించారంటున్నారు. టెక్నికల్ పరంగానూ ఈ చిత్రం ఆకట్టుకుందంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. హిట్ కళ కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మరి.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.