‘హలో’ కాపీరైట్స్ ఇష్యూపై నాగ్ చెప్పిన ‘హాలీవుడ్’ సీక్రెట్

nagarjuna reacts on hello teaser copyrights issue
Tellmeboss.net

అఖిల్ రెండో చిత్రం ‘హలో’ టీజర్‌ని యూట్యూబ్ తొలగించడంపై ఎంతో దుమారం రేగిందో అందరికీ తెలుసు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని కాపీ కొట్టారంటూ యూట్యూబ్ నిర్దాక్షిణ్యంగా తీసిపడేసింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అప్‌లోడ్ చేసినప్పటికీ.. ఇలా జరిగినందుకు మాత్రం ప్రతిఒక్కరూ షాకయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తనయుడి రెండో చిత్రాన్ని రూపొందిస్తున్న నాగ్ మరీ ఇంత నిర్లక్ష్యం వహించాడేంటంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై అఖిల్ ఆ తర్వాతి రోజు ఒక వివరణ ఇచ్చి ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ.. అది పెద్దగా సంతృప్తికరంగా అనిపించలేదు. దీంతో.. మరోసారి నాగ్‌ని ఆ ఇష్యూ గురించి అడగ్గా.. ఆయన ఫుల్ క్లారిటీతో మొత్తం వ్యవహారాన్ని వివరించాడు.

Tellmeboss.net

నాగ్ మాట్లాడుతూ.. ‘‘హలో టీజర్ టైంలో అనూప్ రూబెన్స్ చాలా బిజీగా ఉండడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరేవాళ్లతో చేయించుకున్నాం. ముంబై వాళ్లకి ఈ బాధ్యత అప్పగించగా.. వాళ్లు ఓ హాంకాంగ్ కంపెనీ నుంచి స్కోర్ తీసుకున్నారు. వాళ్లకి హాలీవుడ్ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ ఉంది. యూట్యూబ్ వాళ్లు ‘హలో’ టీజర్ తొలిగించినప్పుడు ఆ కాంట్రాక్ట్ సంస్థకి చెందినవాళ్లు నిద్రపోతున్నారు. వాళ్లు లేచి ఈ ఇష్యూను సార్ట్ ఔట్ చేయడానికి సమయం పట్టింది. అందుకే.. ఆరు గంటల తర్వాత టీజర్ మళ్లీ అప్ లోడ్ చేశాం’’ అని వివరించాడు. ఈ లెక్కన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రైట్స్‌ని యూనిట్ ముందే తీసుకున్నట్లే అన్నమాట. అయితే.. ట్రైలర్‌కి మాత్రం అనూప్‌తోనే వర్క్ చేయించానని నాగార్జున చెప్పుకొచ్చారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.