బంగార్రాజుకి ఓటేసిన నాగ్.. ఈసారైనా వస్తుందా?

నాగార్జున ప్రస్తుతం ఆఫీసర్ సినిమా విడుదల విషయంలో చికాకులు ఎదుర్కొంటున్నాడు. ఆఫీసర్ సినిమా ఈ నెల 25న విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని సమస్యల వలన ఆ సినిమా జూన్ 1కి మారింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఆఫీసర్ సినిమాతో ఇరుక్కుపోయిన నాగ్ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నాడట.

నాగార్జునకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘సొగ్గాడే చిన్నినాయన’ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో బంగార్రాజు అనే పాత్ర ప్రేక్షకుల్లోకి బాగా ఎక్కింది. అందుకే నాగ్ అదే పేరుతో ఒక సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చెయ్యాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అనుకున్న టైంకి పట్టాలెక్కలేదు. అందుకే కళ్యాణ్ కృష్ణ కూడా రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత బంగార్రాజుని తెరకెక్కించే ప్లాన్ చేసినప్పటికీ నాగ్ సహకరించకపోవడంతో రవితేజతో నేల టికెట్ సినిమాని చేసాడు. ఇక ఈ నేలటికెట్ సినిమా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీంతో నేలటికెట్, ఆఫీసర్ సినిమాలు రిలీజ్ అయిన తరువాత కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో బంగార్రాజు సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నాగ్ ఇంతవరకు ఏ దర్శకుడికి కమిట్ కాలేదు. అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా బంగార్రాజు స్క్రిప్ట్ వర్క్‌ని ఎప్పుడో పూర్తి చేసుకున్నాడు. ఏదో చిన్న చిన్న మార్పులు చేస్తే నాగ్‌తో బంగార్రాజు సినిమాని పట్టాలెక్కించేయొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికైనా పట్టాలెక్కుతుందా లేక మరే ఇతర కారణంతో అటకెక్కుతుందా అనేది చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.