సంచలన ట్విస్ట్.. రవితేజ సినిమాని ఆపేసిన నాగ్

nagarjuna stopped ravi teja kalyan krishna movie
Tellmeboss.net

పాపం రవితేజ.. అదేంటో తెలీదు కానీ ఇతనికే ప్రతిసారి ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. పట్టాలెక్కాల్సిన ప్రాజెక్టులు ఇంకా ముహూర్తం చేసుకోకముందే అటకెక్కిపోతున్నాయి. సరే.. ఇదివరకు పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తానే గతంలో చిత్రాల్ని వదులుకున్నాడు కానీ.. ఇంకొకరి ప్రభావంతో అయితే ఆగలేదు.

కానీ.. ఫస్ట్ టైమ్ ఇతని చిత్రానికి నాగార్జున అడ్డుపడ్డాడు. సెట్స్ మీదకి వెళ్లాల్సిన మాస్ మహారాజా సినిమాని అర్థంతరంగా నిలిపివేశాడు. అందుకు కారణం.. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణే! నిజానికి.. నాగ్‌కి, ఆయన కుమారుడు చైతూకి కెరీర్‌లలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది ఈ డైరెక్టరే! అయినా రవితో చేయాల్సిన ప్రాజెక్ట్‌ని నాగ్ ఎందుకు అడ్డుకున్నాడు? అందుకు ఓ బలమైన కారణం ఉందిలెండి.

Tellmeboss.net

‘సోగ్గాడే చిన్ని నాయనా’ రిలీజ్‌కి ముందే ‘అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్’పై వరుసగా మూడు చిత్రాలను తెరకెక్కించేందుకు కళ్యాణ్ కృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం.. రెండు సినిమాలు చేసేశాడు కాబట్టి ఇంకో చిత్రం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సోగ్గాడే చిత్రానికి ప్రీక్వెల్‌గా తీసేందుకు నాగ్‌కి రకరకాల వెర్షన్స్ వినిపించాడు కళ్యాణ్ కృష్ణ. కానీ.. ఏవీ పెద్దగా కన్వీన్స్‌గా లేకపోవడంతో నాగ్ అన్నింటినీ రిజెక్ట్ చేశాడు. దీంతో.. ఆ ప్రాజెక్ట్‌ని పక్కకి పెట్టి రవితేజతో ఓ సినిమాని రూపొందించేందుకు కళ్యాణ్ సిద్ధమయ్యాడు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇవాళే (05-12-2017) ప్రారంభం కావాల్సి ఉంది. ముహూర్తం షాట్ పిక్చరైజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాగ్.. సడెన్ ఎంట్రీ ఇచ్చి ఆపించేశాడట. ఒప్పందం ప్రకారం మూడో చిత్రం తీయకుండానే ఇలా వేరే సినిమా ఎలా స్టార్ట్ చేస్తావంటూ కళ్యాణ్ కృష్ణకు నాగ్ బ్రేక్ వేశారట. దీంతో.. ఈ చిత్రాన్ని ఆపేయాల్సి వచ్చింది.

ఇప్పుడు రవితేజతో చేయాల్సిన సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలంటే.. నాగ్‌తో ‘బంగార్రాజు’ సినిమానో లేక ఆయన తనయులతో మరేదో చిత్రమో చేసి ఆ ఒప్పందాన్ని కంప్లీట్ చేయక తప్పదు. అలా కుదరని పక్షంలో.. ఏదో ఒకటి చెప్పి, నాగ్‌ని ఒప్పించి, రవితేజ చిత్రానికి లైన్ క్లియర్ చేయించుకోవాలి. మరి.. చివరికి ఏమవుతుందో వెయిట్ చేయాల్సిందే!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.