నానీ హీరోయిన్ ముద్దులే ముద్దులు…రికార్డు బద్దలు!!

vani kapoor

బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లు సాధారణమైన అంశం. ముద్దు సన్నివేశాలు లేకుండా ప్రస్తుతం హిందీ సినిమాలు తెరకెక్కడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రచారంలో ఈ ముద్దు సన్నివేశాలు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. తమ సినిమాల్లో ఒకటి, రెండు లిప్‌లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శకనిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రం బేఫికర్ లిప్‌లాక్‌ల పరంగా గత రికార్డులన్నింటిని చెరిపివేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఏకంగా 23 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం.

గతంలో మల్లికా షెరావత్ నటించిన ఖ్వాయిష్ చిత్రంలో 17 అధరచుంబన సన్నివేశాలతో అత్యధిక లిప్‌లాక్‌లు కలిగిన సినిమాగా గుర్తింపును పొందింది. ఆ సినిమాను బేఫికర్ దాటివేసిందంటున్నారు. రణవీర్‌సింగ్, వాణికపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లిప్‌లాక్ దృశ్యంతోనే ఇటీవలే విడుదల చేశారు. కథానుగుణంగా ఈ ముద్దు సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. వాణికపూర్ ఆ మధ్య నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలో కూడా నాని వాణి కపూర్ ల లిప్ లాక్ సన్నివేశం వుండటం గమనార్హం. యష్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.