దిల్ రాజుకి దెబ్బ.. నాని కొట్టాడబ్బా!

Tellmeboss.net

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా చేసిన ప్రతి సినిమాను కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ హీరోతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా రెండు సినిమాలు కానిచ్చేశాడు. ఇప్పటికే ‘‘నేను లోకల్’’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) అంటూ మరో సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఇదే ఊపులో ముచ్చటగా మూడో సినిమాను ప్లాన్ చేసిన దిల్ రాజుకి నాని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

Tellmeboss.net

అవును.. దిల్ రాజు నానితో ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. అయితే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూవా నానికి వినిపించాడు. నానికి కూడా ఆ కథ బాగా నచ్చేయడంతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాడు. కానీ అతడి బిజీ షెడ్యూల్స్ వల్ల రాజుతో సినిమాకు నో చెప్పాల్సి వచ్చిందట. నాని నెక్ట్స్ మూవీగా ‘‘కృష్ణార్జునుల యుద్ధం’’ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తాడు. దీని కారణంగా దిల్ రాజు మల్టీస్టారర్ సినిమాలో చేయలేకపోతున్నాని రాజుకి చెప్పాడు. ఆయన కూడా నాని కష్టాలు తెలుసుకుని సరే అన్నాడట.

ఇక దిల్ రాజు అండ్ టీమ్ ప్రస్తుతం నాని ప్లేస్‌లో వేరే హీరో కోసం తెగ వెతికేస్తున్నారు. మరి నాని చేయాల్సిన సినిమాలో ఎవరు నటిస్తారో చూడాలి. కాగా దిల్ రాజుకు నాని నో చెప్పాడనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Tellmeboss.net
Related posts:
బాహుబ‌లికి చిక్కులు...రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చ‌రిక‌లు
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొత్త ట్రెండ్!!
నాని ‘జెంటిల్‌మన్’ సినిమా ప్రీ-రివ్యూ
ఫిదా 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. తెలుగు వారు ఫిదా!
షాలినీకి అంత సీన్ లేదంటూ పచ్చిగా తిట్టిన శ్రావ్యారెడ్డి
‘జై లవ కుశ’ వరల్డ్‌వైడ్ ఫైనల్ కలెక్షన్స్.. సౌత్ ఇండియాలోనే తారక్ ఫస్ట్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.