నైజాం నవాబ్‌గా మారిన మిడిల్ క్లాస్ అబ్బాయి

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ మిడిల్ క్లాస్ అబ్బాయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నాని మరోసారి తన సత్తా చాటుకుని వరుసగా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాని యాక్టింగ్‌కు పట్టం కట్టారు. అప్పటికే నేను లోకల్, నిన్ను కోరి సినిమాలతో రెండు సక్సెస్‌లు అందుకున్న నాని ఈ సినిమాతో ఈ ఏడాదిలో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.

ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దుమ్ములేపింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో నాని సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో ఈ సినిమా మిలియన్ డాలర్‌ క్లబ్‌లోకి చాలా ఈజీగా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా MCAకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా రూ. 14 కోట్ల షేర్ కలెక్షన్స్ రావడం విశేషం. నాని గత సినిమా ‘నేను లోకల్’కు ఈ ప్రాంతంలో రూ. 11.20 కోట్ల అత్యధిక కలెక్షన్స్ రాగా ఇప్పుడు MCA దాన్ని కూడా దాటేసింది. పండుగ సమయంలో మరో 50 లక్షల వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు చిత్ర వర్గాలు.

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.