‘నెపోలియన్’ మూవీ రివ్యూ-రేటింగ్.. సగం టికెట్ సినిమా!

napoleon-review-rating

సినిమా : నెపోలియన్
నటీనటులు : ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, తదితరులు
దర్శకుడు : ఆనంద్ రవి
నిర్మాత : భోగేంద్ర గుప్తా
సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని
సినిమాటోగ్రఫీ : మార్గాల డేవిడ్
రిలీజ్ డేట్ : 24-11-2017

‘ప్రతినిధి’ చిత్రంతో రచయితగా మంచి పేరు సంపాదించుకున్న ఆనంద్ రవి.. ఇప్పుడు ‘నెపోలియన్’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించాడు. ప్రోమోల్లో ‘నీడ పోయిందనే’ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించింది. మరి.. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రోమోల్లాగే ఆడియెన్స్‌ని అలరించిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి తన నీడ పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. అసలు నీడెలా పోయిందని పోలీసులు విచారణ చేస్తుండగా.. ఆ గందరగోళంలోనే వారిచేత మూసివేయబడిన ఒక హత్య కేసును ఓపెన్ చేయిస్తాడు. ఇంతకి ఈ నెపోలియన్ ఎవరు? అతని నీడెలా పోయింది? అసలు అతను మూసివేయబడిన కేసుని మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయిస్తాడు? ఆ కేసుకి, ఇతనికి సంబంధం ఏంటి? ఈ నేపథ్యంలో వెలుగుచూసినా నిజాలేంటి? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
కొత్త కాన్సెప్ట్ సినిమాలనగానే.. మొదటినుంచి చివరివరకు థ్రిల్లింగ్‌గా సాగుతుందని అందరూ ఆశిస్తారు. ఫస్టాఫ్ ఒకింత థ్రిల్ చేస్తే.. సెకండాఫ్ అంతకుమించేలా ఉండాలని కోరుకుంటారు. ‘నెపోలియన్’ ప్రోమోలు చూసి.. ఆ చిత్రం కూడా చివరివరకు థ్రిల్ చేయడం ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే.. ఈ చిత్రం జనాల్ని పెద్ద బఫూన్స్ చేసేసింది. ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ మరోలా చూపించి.. ‘అసలేంటిది?’ అనే ప్రశ్నార్థకంతో థియేటర్లనుంచి బయటికొచ్చేలా చేసింది.

ఫస్టాఫ్ వరకు ఓకే.. హీరో నీడ నిజంగానే పోవడం, దాని వెనుక గల కారణం ఏంటనే ఉత్కంఠ రేపుతూ చాలా ఇంట్రెస్టింగ్‌గానే సాగింది. తన నీడ పోయిందని హీరో కంప్లైంట్ ఇచ్చాక సాగే ఎపిసోడ్స్ ఆసక్తిగా సాగడం, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక కేసును రీఓపెన్ చేయడం వంటి సీన్లు అదిరిపోయాయి. ఒకదాని తర్వాత మరొక ట్విస్టుతో.. తర్వాత ఏం జరిగిందనే ఆసక్తితో జనాల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేశాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఇదంతా చూసి.. సెకండాఫ్ ఇక ఓ రేంజులో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఎఫెక్టివ్ సోషల్ మెసేజ్ ఏదైనా ఇస్తారేమో అని కుతూహులం కలుగుతుంది. కానీ.. సెకండాఫ్ చూశాక ఆ ఉత్సాహం అంతా ఒక్కసారిగా నీరుగారిపోతుంది.

ద్వితీయార్థం చూస్తున్నంతసేపూ.. ‘అసలు ఇది ఇదివరకు చూసిన ‘నెపోలియన్’ సినిమానేనా’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌కి, సెకండాఫ్‌కి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో ఆడియెన్స్‌కి విరక్తి కలిగిస్తుంది. ఫస్టాఫ్ చూశాక నెలకొన్న తారాస్థాయి అంచనాలు.. సెకండాఫ్‌లో ఇదొక రొటీన్ సినిమా అని తేలగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దర్శకుడు అంతిమంగా చెప్పాలనుకున్న పాయింట్‌కు మొదట్లో నడిపిన సస్పెన్స్ డ్రామా మొత్తం అనవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఫస్టాఫ్ ‘కిక్’ ఇస్తే, సెకండాఫ్ ‘బ్యాక్‌ కిక్’ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

నటీనటుల – టెక్నికల్ ప్రతిభ :
ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన రచయిత-దర్శకుడు ఆనంద్ రవి సెటిల్డ్ క్యారెక్టర్‌లో నటించాడు. నటి కోమలి ఫర్వాలేదు. పోలీసాఫీసర్‌గా నటుడు రవి వర్మ ఫుల్ లెంగ్త్‌లో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావాళ్లు మామూలే! ఇక మార్గాల డేవిడ్ అందించిన సినిమాటోగ్రఫీ.. అలాగే సిద్దార్థ్ సదాశివుని ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఆ రెండూ ఈ చిత్రానికి మేజర్ హైలైట్‌గా నిలిచాయి. కానీ.. ఎడిటింగ్‌లో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా.. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను తీసేయాల్సింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడు ఆనంద్ రవి విషయానికొస్తే.. ఫస్టాఫ్ వరకు తన రచనా ప్రతిభ చాటుకున్నాడు కానీ, సెకండాఫ్‌ని మాత్రం సాదాసీదాగా రెడీ చేసి ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచాడు. ఫస్టాఫ్‌లోలాగే సెకండాఫ్‌ని నడిపి ఉంటే.. ఈ చిత్రం ఖచ్ఛితంగా వర్కౌట్ అయ్యుండేది.

చివరగా : ఫస్టాఫ్ థ్రిల్.. సెకండాఫ్ తుస్.. హాఫ్ టికెట్ సినిమా!
రేటింగ్ : 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.