తారకమంత్రాన్ని అడ్డంగా వాడుకుంటున్న నాని

సినిమాల్లోనే కాదు.. బయట కూడా మాంచి కామిక్ టైమింగ్ ఉన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు! స్పాట్‌లోనే పంచ్‌లు వేయడం, పర్ఫెక్ట్ టైమింగ్‌తో అవాక్కయ్యేలా చేయడం మనోడు తనకుతానే సాటి! అలాంటి నాని ‘బిగ్‌బాస్-2’కి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని తెలిసి.. అతనిపై బోలెడన్ని ఆశలు రేకెత్తాయి. ఈసారి తన కామిక్ టైమింగ్‌కి మరింత డోస్ పెంచి ఎంటర్టైన్ చేస్తాడని.. తారక్‌ని మైమరిపిస్తాడని అందరూ భావించారు.

తీరా చూస్తే.. మనోడు ఆ ఆశలపై నీరుగార్చేశాడు. తొలి ఎపిసోడ్‌లో ఎక్కడా తన మార్క్ కామెడీ చూపించకపోవడం, కనీసం తారక్‌లాగా కొంచెం కూడా ఆకట్టుకోకపోవడంతో.. టెలివిజన్ ఆడియెన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు నాని హోస్టింగ్‌పై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. ఆ తర్వాతి వీకెండ్‌లో మాత్రం నాని కొద్దోగొప్పో యాంకరింగ్ స్కిల్స్‌తో ఫర్వాలేదనిపించాడు. మరీ తారక్ స్థాయిలో కాకపోయినా.. ఓకే అనుకునేలా మెప్పించగలిగాడు. సరే.. ఇకనుంచి ఇలాగే అలరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కట్ చేస్తే.. గత వీకెండ్‌ (23, 24 తేదీలలో)లో మాత్రం మనోడు పెద్ద షాకిచ్చాడు. తన మార్క్ స్టైల్‌లో కాకుండా.. తారక్‌ని ఇమిటేట్ చేస్తూ యాంకరింగ్ చేశాడు. బాగా గమనిస్తే.. నాని హోస్టింగ్‌లో పక్కాగా తారక్ మేనరిజం, స్టైల్ కనిపిస్తాయే తప్ప ఎక్కడా నాని నేచురల్ మార్క్ కనిపించలేదు. చూస్తుంటే.. మనోడు గత తారక్ ఎపిసోడ్స్ చూసి, అతనిలాగే అనుకరించినట్లు అనిపిస్తోంది. నెటిజన్ల అభిప్రాయం కూడా దాదాపు ఇదేనని తేలింది. ఇలాగే కొనసాగితే.. నాని ఖచ్చితంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. చూద్దాం.. ఇకనుంచి ఎలా హ్యాండిల్ చేస్తాడో?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.