ప్రెస్‌మీట్ సాక్షిగా.. తారక్ పరువు తీసిన నాని

నటరుద్ర ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నానిల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలుసు! ఏ విషయమైనా బాహాటంగా పంచుకుని.. తమ ఫ్రెండ్‌షిప్‌ని చాటిచెప్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంటారు. తారక్‌కి స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ.. అలాంటి పట్టింపేమీ లేకుండా నానితో జోలిగా కలిసిపోతాడు. అలాంటి తారక్‌ని ప్రెస్‌మీట్ సాక్షిగా అవమానించినంత పని చేశాడు నాని!

‘బిగ్‌బాస్-2’ షోకి నాని వ్యాఖ్యతగా నిర్వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! మరికొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుండగా.. నానితో ప్రెస్‌మీట్ నిర్వహించింది యాజమాన్యం! ఈ నేపథ్యంలో నానికి తారక్ విషయమై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు అతనిచ్చిన సమాధానాలు వింటే.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే! ‘బిగ్‌బాస్ సీజన్ వన్ ఎంత పెద్ద హిట్ అయ్యింది కదా? అది అంత ఘనవిజయం సాధించడం వెనుక తారక్ హోస్టింగ్ ప్రముఖ పాత్ర వహించింది. దీంతో మీరేమైనా ఒత్తిడికి గురవుతున్నారా?’ అని ఓ విలేకరి అడిగితే.. అసలు తాను మొదటి సీజన్ చూడనే లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. తాను మాత్రం బిగ్‌బాస్ షో చూడలేదని మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు.

‘పోనీ.. హోస్టింగ్ విషయమై తారక్ నుంచి ఎలాంటి టిప్స్ అయినా తీసుకున్నారా?’ అని అడిగితే.. లేదంటూ మరో షాకిచ్చాడు నాని! తారక్ తనని టిప్స్ ఫాలో అవ్వొద్దని చెప్పాడని.. స్టేజ్ మీద మనం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటామో అలాగే ఉండమని సూచించమని తెలిపాడు. ఇది సరే.. హోస్టింగ్‌ని బాగా పండించేందుకు తారక్‌ని ఫాలో అవుతారా? అంటే.. లేదని ఆశ్చర్యపరిచాడు. తాను తనలాగే ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తానే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ తారక్‌ని ఫాలో అవ్వనని వెల్లడించాడు. ఇది కాస్త సంతృప్తికరంగా అనిపించినా.. తన క్లోజ్ ఫ్రెండ్ వ్యాఖ్యతగా నిర్వర్తించిన తొలి సీజన్‌ని చూడలేదని నాని చెప్పడమే జీర్ణించుకోలేని విషయం!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.