శ్రీరెడ్డికి నాని ‘బిగ్’ పంచ్.. దెబ్బ అదుర్స్ ‘బాస్’!

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీరెడ్డి గతకొన్ని రోజుల నుంచి నేచురల్ స్టార్ నాని మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! అందరూ అనుకుంటున్నట్లు నాని మంచివాడేమీ కాదని… ఆఫర్ల పేరుతో అతను ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశాడని… తనని కూడా ఒక చిత్రంలో ఛాన్స్ ఇస్తానని చెప్పి వాడుకున్నాడని… పైన కనిపించేంత మంచోడేమీ కాదంటూ ఈ అమ్మడు పదేపదే ఆరోపిస్తూ వస్తోంది.

చివరికి.. ‘బిగ్‌బాస్-2’ ఛాన్స్ రాకపోవడానిక్కూడా నానినే కారణమంటూ రీసెంట్‌గా కుండబద్దలుకొట్టింది శ్రీరెడ్డి! తన దగ్గర ఆధారాలు లేకపోవడం వల్ల ఇన్నాళ్ళూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పిన ఈమె.. తన లాయర్ ఇచ్చిన బూస్ట్‌తో నాని బండారం బయటపెట్టాలని అనుకున్నానని చెప్పింది. ‘నాని+శ్రీరెడ్డి=డర్టీ పిక్చర్’ని త్వరలోనే చూపిస్తానని.. అతని అసలు రూపం ప్రపంచానికి తెలియచేస్తానని భారీ డైలాగులు కొట్టింది. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా.. నాని ఎందుకు స్పందించలేదు? అనే డౌట్ అందరిలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి ఆరోపణలపై జనాల్లో అనుమానం రేకెత్తింది. బహుశా అవి నిజమేనేమోనని నాని మౌనం ప్రేరేపించేలా చేసింది.

అయితే.. ఆ అనుమానాలు మరీ ఎక్కువ కాకముందే నాని కౌంటర్ ఇచ్చేశాడు. శ్రీరెడ్డి చెప్పిందంతా ‘కాకమ్మ కథలే’నని క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆమెకు మామూలే కదా! అందుకే ఆ వ్యవహారంపై స్పందించకపోవడమే మంచిదని అనుకున్నా’’నని నాని ఆమె వ్యాఖ్యలపై స్పందించినట్లుగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక పేర్కొంది. ఇక ‘బిగ్‌బాస్’, ‘స్టార్‌మా’ యాజమాన్యాలు కూడా శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించినట్లు ఆ పత్రిక తెలిపింది.

బిగ్‌బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్లను ముంబైకి చెందిన ఒక టీమ్ ఎంపిక చేస్తుందని… దాంతో నానికి ఎలాంటి సంబంధం ఉండదని ‘‘స్టార్ మా’’ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. శ్రీరెడ్డి చెప్తున్నట్లుగా.. బిగ్‌బాస్, స్టార్ మా ప్రతినిధులెవ్వరూ ఆమెని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చేశారు. చివరికి.. ‘స్టార్ మా’ సిబ్బందికి కూడా షోకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా గురించి ముందుగా తెలిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి.. దీనిపై శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related posts:
అడ్డంగా దొరికిపోయిన భార్యను వీధుల్లో నగ్నంగా నడిపాడు!
మహిళలను అవమానించారని బాలయ్యపై కేసు నమోదు??
జూనియర్ ఎన్టీఆర్‌ని అందుకే తొక్కేశారంటూ రోజా సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్‌పై భారీ కుట్ర.. ఈ పిచ్చి అభిమానం ఏంటో?
బ్రా లేకుండా ‘క్లీవేజ్ షో’తో మళ్ళీ రెచ్చిపోయిన కాజల్..
తారక్ పెట్టిన ఫిట్టింగ్.. బన్నీకి కళ్యాణ్ సవాల్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.